21 నవంబర్, 2020

హైద‌రాబాద్ ఎంప్లాయీస్ స్టేట్ ఇన్య్సూరెన్స్ కార్పొరేష‌న్ లో ఉద్యోగాలు

హైద‌రాబాద్ (స‌న‌త్‌న‌గ‌ర్‌)లోని ఎంప్లాయీస్ స్టేట్ ఇన్య్సూరెన్స్ కార్పొరేష‌న్ (ఈఎస్ఐసీ) మెడిక‌ల్ కాలేజ్ ఒప్పంద ప్రాతిప‌దిక‌న 187 పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది. 

సంస్థ పేరు :  ఎంప్లాయీస్ స్టేట్ ఇన్య్సూరెన్స్ కార్పొరేష‌న్

విభాగాలు :  నాట‌మీ, ఫిజియాల‌జీ, బ‌యోకెమిస్ట్రీ, మైక్రోబ‌యాల‌జీ, పాథాల‌జీ, ఫోరెన్సిక్ మెడిసిన్‌, పీడియాట్రిక్స్‌, అనెస్తీషియా త‌దితర విభాగాల్లో ఉన్నాయి.

మొత్తం ఖాళీలు: 187

ఫ్యాక‌ల్టీ పోస్టులు- 46 (ప్రొఫెస‌ర్‌-09, అసోసియేట్ ప్రొఫెస‌ర్‌-25, అసిస్టెంట్ ప్రొఫెస‌ర్-12)

అడ్జంక్ట్ ఫ్యాక‌ల్టీ సూప‌ర్ స్పెష‌లిస్ట్‌- 15

స్పెషాలిటీ స్పెష‌లిస్ట్‌- 10

క‌న్స‌ల్టెంట్‌- 04

సీనియ‌ర్ రెసిడెంట్‌- 103

రిసెర్చ్ సైంటిస్ట్‌- 02

జూనియ‌ర్ రెసిడెంట్‌- 07

అర్హ‌త‌: పోస్టును అనుస‌రించి ఎంబీబీఎస్‌, సంబంధిత స్పెష‌లైజేష‌న్ల‌లో పీజీ డిగ్రీ/ పీజీ డిప్లొమా, ఎండీ/ పీహెచ్‌డీ ఉత్తీర్ణ‌త‌తో పాటు అనుభ‌వం ఉండాలి.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్‌, ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

వాక్ఇన్ ఇంటర్వ్యూ తేది: నవంబర్‌ 25 నుంచి డిసెంబర్‌ 17 వరకు.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుకు ఈనెల 22 చివరితేది. షార్ట్‌లిస్టింగ్‌, ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఈ పోస్టులను భర్తీ చేస్తారు. అభ్యర్థులు పూర్తి వివరాలకు https://www.esic.nic.in/ వెబ్‌సైట్‌ చూడొచ్చు.

దరఖాస్తులు ప్రారంభం: నవంబర్‌ 11, 2020

ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: నవంబర్‌ 22, 2020

వెబ్‌సైట్‌: https://www.esic.nic.in/