5 జులై, 2020

వైద్య ఆరోగ్య శాఖలో స్టాఫ్ నర్స్, డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలు

ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మరియు వైద్య విధాన పరిషద్ లలో నోటిఫికేషన్ ల వర్షం పడుతోంది, ఇవి నిరుద్యోగులు ఆనందం కలిగించే అంశమే అయినా ఇవి అన్ని కాంట్రాక్ట్ మరియు అవుట్ సోర్సింగ్ పోస్టులు కావడం కొంత బాధాకరం , కొత్తగా పశ్చిమ గోదావరి జిల్లా వైద్య విధాన పరిషద్ నుండి 91 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయింది, ఆ నోటిఫికేషన్ వివరాలు క్రింద ఇవ్వబడ్డాయి. 

సంస్థ పేరు :  ఆంధ్ర ప్రదేశ్ వైద్య విధాన పరిషద్ 

పని ప్రదేశం :  పశ్చిమ గోదావరి జిల్లా 

మొత్తం ఖాళీ లు :  91 పోస్టులు 

పోస్టుల వివరాలు :  
1) స్టాఫ్ నర్స్ - 59 
2) నర్సింగ్ ఆర్డ‌ర్లీ - 12 
3) బయో స్ఠాటి స్టియన్ - 01 
4) డేటా ఎంట్రీ ఆపరేటర్ - 12 

ఈ ఉద్ద్యోగాలకు పోస్టులను బట్టి పదవతరగతి, ఇంటర్, జిఎన్ ఎం , బిఎస్సి నర్సింగ్, బీఏ , బిఎస్సి అర్హతలు ఉండాలి , అలాగే ఈ ఉద్యోగాలకు ఇంటర్వ్యూ నిర్వహించి, మెరిట్ ప్రకారం ఎంపిక చేస్తారు 

అర్హులయిన అభ్యర్థులు క్రింద ఇచ్చిన దరఖాస్తు ఫారం డౌన్లోడ్ చేసుకుని , పూర్తి చేసిన దరఖాస్తు, మరియు సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలను డిస్ట్రిక్ట్ కో ఆర్డినేటర్ అఫ్ హాస్పిటల్ సర్వీస్ , డిస్ట్రిక్ట్ హాస్పిటల్ కాంపౌండ్, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లా నందు స్వయంగా అందచేయాలి, చివరి తేదీ 09 జులై 2020