8 డిసెంబర్, 2019

ప్రపంచంలో నష్టాలు లేని ఏకైక బిజినెస్ ఫోటో స్టూడియో & జిరాక్స్

కొన్ని కొన్ని వ్యాపారాలకు నష్టాలు వస్తాయో లాభాలు వస్తాయో చెప్పలేం. మనం వ్యాపారం ప్రారంభించిన తరువాత మాత్రమే ఈ లాభనష్టాలు అనేవి తెలుస్తాయి. కానీ కొన్ని వ్యాపారాలకు మాత్రం ఎల్లప్పుడూ లాభాలే వస్తాయని చెప్పొచ్చు. అలాంటి ఒక వ్యాపారమే ఫోటో స్టూడియో బిజినెస్. ఇక విషయానికి వస్తే పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్, నార్మల్ ఫొటోస్, జిరాక్స్, కలర్ జిరాక్స్, ప్రింట్ ఆవుట్స్ వంటివి ఏదో ఒక రోజు అవసరం అవుతూనే ఉంటాయి. 

గవర్నమెంట్ కార్యాలయాల్లో పని మీద గాని, విద్యార్థులకు చదువుకు సంబంధించిన విషయాల్లో గాని వీటి అవసరం ఉంటుంది. మార్కెట్లో ఎల్లప్పుడూ వీటికి డిమాండ్ ఉంటూనే ఉంటుంది. అందువలన ఈ ఫోటో స్టూడియో బిజినెస్ కి లాస్ లేని బిజినెస్ గా పేరుంది. ఫోటో స్టూడియోలో కేవలం మనం ఫొటోస్ తీయడమే కాకుండా జిరాక్స, ప్రింటర్స్ వంటి సర్వీసులను కూడా అందించాలి. అప్పుడే మన బిజినెస్ అనేది మూడు పువ్వులు ఆరు కాయలు కింద ముందుకు సాగుతుంది. ఈ బిజినెస్ లో ఉండే లాభాల గురించి తెలియకపోవడం వల్లే దీన్ని ప్రారంభించడానికి చాలామంది వెనుకడుగు వేస్తుంటారు. కానీ ఈ రోజు మనం బిజినెస్ కు సంబంధించిన అన్ని విషయాలను స్పష్టంగా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం.