October 2, 2019

Defence Accounts Department Jobs || పదవతరగతి అర్హత తో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు డైరెక్ట్ జాబ్స్

భారత రక్షణ మంత్రిత్వ శాఖా ఆధ్వర్యంలో పనిచేసే డిఫెన్స్ అఫ్ అకౌంట్స్ (పెన్షన్) విభాగంలో క్యాంటీన్ అటెండెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయింది. కేవలం పదవతరగతి పాస్ అయిఉండి ఇంకేమి అదనపు అర్హతలు, అనుభవం అవసరం లేని ఈ ఉద్యోగాలకు ఆసక్తి ఉన్న అభ్యర్థులు 28 అక్టోబర్ 2019 లోపు అప్లై చేసుకోవాలి 

వివరాలు :  కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు 

ఉద్యోగం పేరు :  క్యాంటీన్ అటెండెంట్ 

అసలు క్యాంటీన్ అటెండెంట్ ఏమిటి :  వంట చేయడం, వంట సరుకులు(కూరగాయలు) తరగటం, క్లీనింగ్ మరియు రికార్డు మెయింటేన్ చేయడం. 

మొత్తం ఖాళీలు : 13 పోస్టులు 

రిజర్వేషన్లు :  ఎస్సి- 02, ఎస్టీ - 01, ఓబిసి - 03, జనరల్ - 06, ఈడబ్ల్యూఎస్ - 01

జీతం :  నెలకు 20,200 రూపాయలు 

అర్హతలు :  కనీసం పదవతరగతి పాస్ 

వయసు :  28 అక్టోబర్ 2019 నాటికి 18 నుండి 25 ఏళ్లలోపు ఉండాలి ఎస్సి,ఎస్టీ,వారికీ 05 ఏళ్ళు, ఓబిసి వారికీ 03 ఏళ్ళు, పిడబ్ల్యుడి వారికీ 10 ఏళ్ళు సడలింపు ఉంది. 

ఎంపిక విధానం :  స్క్రీనింగ్ / సెలక్షన్/ ఎక్జామినేషన్ మరియు సర్టిఫికెట్ వెరిఫికేషన్ 

అప్లై చేయు విధానము :  నోటిఫికేషన్ తో పాటు ఇచ్చిన అప్లికేషన్ ఫారం ను ప్రింట్ తీసుకుని , పూర్తి చేసిన అప్లికేషన్ తో పాటు సంబంధిత సర్టిఫికెట్లు జతపరిచి వాటిని Principal Controller of Defence Accounts (Pensions), Draupadighat, Allahabad ‐211014. అనే చిరునామాకు 28 అక్టోబర్ 2019 లోపు చేరునట్లు పోస్ట్ ద్వారా పంపించాలి. 





0 Comments