October 2, 2019

ఆ మాటే వినపడకూడదు | YS జగన్

ఆంధ్రప్రదేశ్ లో మిగిలిపోయిన వాలంటీర్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి మంగళవారం ముఖ్యమంత్రి శ్రీ జగన్ మోహన్ రెడ్డి గారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 

గ్రామ/వార్డు సచివాలయాలు ఎంపికలు సెప్టెంబర్ 30 వతేదీనాటికి పూర్తి అయి అక్టోబర్ 02 వతేది నుండి వారు కొత్తగా ఉద్యోగాలలో చేరనున్న నేపథ్యంలో ఈ ప్రకటన చేయడం గమనార్హం 

మంగళవారం ముఖ్యమంత్రి నిర్వహించిన స్పందన కార్యక్రమం పైన సమీక్షలో జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఉన్నతాధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. అక్టోబర్ 15వతేది నాటికి రాష్ట్రంలో వాలంటీర్ ఉద్యోగాలు అనేవి ఖాళీగా ఉన్నాయి అనే మాట తనకు వినిపించకూడదని ఆయన స్పష్టం చేశారు. వాలంటీర్ పోస్టులు ఖాళీగా ఉంటె ప్రయోజనాలు నెరవేరవని , చివరిస్థాయిలో అనుసంధానం నిలిచిపోతుంది అని పేర్కొన్నారు.  ఒకవేళ గ్రామ స్థాయిలో మిగిలిన ఉద్యోగాలకు అర్హతను ఇంటర్ గా నిర్ణయించాలని కూడా ఆదేశించారు. 

ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ లో మిగిలిపోయిన వాలంటీర్ ఉద్యోగాలకు త్వరలో నోటిఫికేషన్ జారీ చేసి అక్టోబర్ 15 నాటికి పూర్తి చేయనున్నారు. 

0 Comments