October 9, 2019

తెలుగు జనరల్ నాలెడ్జ్ || రాష్ట్ర విభజనతో తెలుగు ప్రజలకి ఏం జరిగింది? ఏం ఒరిగింది?

* మద్రాసు రాష్ట్రంలో ఆంధ్రులకు తగినంత ప్రాధాన్యం ఉండేది కాదు. అందుకే గుంటూరులో ఏర్పడిన 'యువజన నవ్య సాహితి' సంస్థ మొదటగా ఆంధ్ర రాష్ట్ర భావాన్ని లేవనెత్తింది.

* ఆంధ్ర రాష్ట్ర పటాన్ని తయారు చేసి ఆంధ్ర రాష్ట్ర భావాన్ని ప్రచారం చేసిన వ్యక్తి జొన్నవిత్తుల గురునాధం'

ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కోసం 1912లో 'ఆంధ్ర మహాసభ ఏర్పడింది. ఆంధ్ర మహాసభ మొదటి సమావేశం 1913లో బాపట్లలో జరిగింది. ఈ సమావేశానికి అధ్యక్షుడు బి.ఎన్. శర్మ,

* 1914లో జరిగిన ఆంధ్ర మహాసభ సమావేశానికి  న్యాపతి సుబ్బారావు అధ్యక్షత వహించారు. ఈ సమావేశం విజయవాడలో జరిగింది. ఇక్కడే ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర తీర్మానాన్ని ఆమోదించారు.

1937 నవంబరు 16న కోస్తా, రాయలసీమ నాయకుల మధ్య మద్రాసులోని శ్రీ కాశీనాథుని నాగేశ్వర రావు నివాస గృహమైన శ్రీబాగ్లో ఒప్పందం కుదిరింది. దీనినే శ్రీబాగ్ ఒప్పందం అంటారు.

రెండో ప్రపంచయుద్ధ కాలంలో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర భావన కొంత మరుగున పడింది.

* భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరవాత భాషా ప్రాతిపదికన రాష్ట్రాల ఏర్పాటుకు 'థార్ కమీషన్ - 1948" ను నియమించారు.

భాషా ప్రాతిపదికన రాష్ట్రాల ఏర్పాటు శాంతి భద్రతలకు విఘాతం కల్గిస్తుందని 'థార్ కమిటీ' పేర్కొంది.

+ దీంతో ఆంధ్రాలో ఉద్యమాలు ప్రారంభమయ్యాయి. ఫలితంగా 'జేవీపీ' కమిటీ ఏర్పడింది.

జేవీపీ కమిటీలో జవహర్ లాల్ నెహ్రూ, వల్లభాయ్ పటేల్, పట్టాభి సభ్యులుగా ఉన్నారు. మద్రాసుని వదులుకుంటే ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తామని జేవీపీ కమిటీ తెలిపింది

ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం 25 రోజులు నిరాహార దీక్ష చేసిన 'స్వామి సీతారాం', 'వినోబాబావే' మధ్యవర్తిత్వంతో దీక్ష విరమించారు,

ఆత్మార్పణ తప్ప ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు మార్గం లేదని గమనించిన 'పొట్టి శ్రీరాములు' 1952 ఆక్టోబరు 19న మద్రాసులోని బులుసు సాంబమూర్తి ఇంట్లో ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు. ఈయన 1952 డిసెంబరు 15న అమరుడయ్యారు.

* పొట్టి శ్రీరాములు మరణంతో ఆంధ్ర రాష్ట్రం అట్టుడికింది. 1952 డిసెంబరు 19న నెహ్రూ ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తామని పార్లమెంటులో ప్రకటించారు.

1953 ఆక్టోబరు 1న కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. 1954లో ఆంధ్ర హైకోర్టు గుంటూరులో ఏర్పడింది. ఆంధ్ర రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు కాగా చివరి ముఖ్యమంత్రి బెజవాడ గోపాల్ రెడ్డి, ఆంధ్ర రాష్ట్ర మొదటి డిప్యూటీ ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి. మొదటి గవర్నర్ సీ.ఎం. త్రివేది. ఆంధ్ర హైకోర్టు మొదటి చీఫ్ జస్టిస్ కోకా సుబ్బారావు

హైదరాబాద్లో తెలుగు మాట్లాడేవారు, ఆంధ్ర రాష్ట్రంలో తెలుగు మాట్లాడేవారు కలసి 'విశాలాంధ్ర' గా ఏర్పడాలని 'కమ్యూనిస్టులు' ఉద్యమాన్ని ప్రారంభిం చారు. ఇదే విశాలాంధ్ర ఉద్యమం.

ఇదే సమయంలో కేంద్రం 'ఫజల్ అలీ' ఆధ్యక్షతన మొదటి ఎస్ఆరసీని నియమించి భాషా ప్రాతిపదికన రాష్ట్రాల ఏర్పాటుకు మొగ్గు చూపింది. దీంతో 1956 ఫిబ్రవరి 20న హైదరాబాద్ కి చెందిన నలుగురు, ఆంధ్ర రాష్ట్రానికి చెందిన నలుగురు ప్రముఖులు ఢిల్లీలో పెద్ద మనుషుల ఒప్పందం కుదుర్చుకున్నారు.

1956 నవంబరు 1న హైదరాబాద్ రాజధానిగా ఆంధ్రప్రదేశ్ ఆవిర్భవించింది. * ఆంధ్రప్రదేశ్ మొదటి ముఖ్యమంత్రి నీలం సంజీవ రెడ్డి, మొదటి గవర్నర్ సీ.ఎం. త్రివేది.
==============================================

తదుపరి పరిణామాలు
* విద్య, ఉద్యోగ, రాజకీయాల్లో తెలంగాణ ప్రజలకు తగిన ప్రాధాన్యం ఉండేది కాదు.

* 'ముల్కి నిబంధనలు', పెద్ద మనుషుల ఒప్పందం లోని అంశాలను అమలు చేయలేదు.

* దీంతో తెలంగాణ ప్రజలు 1969లో 'తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించారు.

* ఈ ఉద్యమాన్ని చూసి ఇందిరాగాంధీ ప్రభుత్వం తెలంగాణకు చెందిన పి.వి.నరసింహారావును ముఖ్యమంత్రిగా నియమించింది 1912లో ఆంధ్రులు 'జై ఆంధ్ర ఉద్యమాన్ని లేవదీశారు. చివరికి కేంద్ర ప్రభుత్వం కొన్ని పథకాల ద్వారా ఉద్యమాలను చల్లార్చింది,

2001లో కె. చంద్రశేఖరరావు టీడీపీ సభ్యత్వానికి రాజీనామా చేసి 'టీఆర్ఎస్ పార్టీని స్థాపించారు.

2009 అక్టోబరు 8న ముల్కీ నిబంధనలు వర్తించవని జేసీ తీర్పు ఇచ్చింది. 

2009 నవంబరు 20న కేసీఆర్ నిరాహార దీక్ష ప్రారంభించారు.

+ 2009 డిసెంబరు 1న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కె. రోశయ్య ఆధ్వర్యంలో తొమ్మిది పార్టీలతో ఆఖిల పక్ష సమావేశం జరిగింది. తెలంగాణకు సంబంధించి మొదటి ప్రకటన 2009 డిసెంబరు 9న వెలువడింది. అప్పటి హోంమంత్రి పి. చిదంబరం.

కేంద్రం, తెలంగాణకు సంబంధించి మొదటి అఖిల పక్ష సమావేశాన్ని 2010 జనవరి 5న చిదంబరం అధ్యక్షతన ఢిల్లీలోని నార్త్ బ్లాక్ లో నిర్వహించింది,

శ్రీకృష్ణ కమిటీ
ఆంధ్రప్రదేశ్లో నెలకొన్న పరిస్థితులను పరిశీలించేం దుకు కేంద్ర ప్రభుత్వం 2010 ఫిబ్రవరి 8న 'బి.ఎన్. శ్రీ కృష్ణ' ఆధ్యక్షతన ఓ కమిటీని వేసింది. ఇందులో నలుగురు సభ్యులు ఉన్నారు. వారు.. దుగ్గల్, రవీందర్ కౌర్, రణబీర్ సింగ్, అబుసలే షరీఫ్.

శ్రీ కృష్ణ కమిటీ 505 పేజీలు, 9 ఆధ్యాయాలతో నివేదిక వెలువరించింది. ఈ కమిటీ ఆంధ్రప్రదేశ్ విభజనకు సంబంధించి ఆరు సిఫారసులు చేసింది. అవి
* యథాతథంగా ఉంచడం

* ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తెలంగాణ, సీమాంధ్రగా విభజించి హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేయడం.

* రాయల తెలంగాణ, కోస్తాంధ్రా ప్రాంతాలుగా విభజించడం

* హైదరాబాద్ రాజధానిగా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసి సీమాంధ్రకు కొత్త రాజధానిని. నిర్మించడం (ఈ సిఫారసుకే శ్రీ కృష్ణ కమిటీ అధిక ప్రాధాన్యమిచ్చింది)

 * ఆంధ్రప్రదేశ్ అలాగే ఉంచి తెలంగాణ అభివృద్ధికి ప్రాంతీయ మండలిని ఏర్పాటు చేయడం.. 2010 జూలై 31న పి. చిదంబరం ఆర్థిక మంత్రిగా వెళ్లగా సుశీల్ కుమార్ షిండే హోం మంత్రిగా నియమితు లయ్యారు. 2012 డిసెంబరు 28న షిండే ఢిల్లీలో అఖిల పక్ష సమావేశాన్ని నిర్వహించి అన్ని పార్టీల అభిప్రాయాలను సేకరించారు.

2013 జూలై 13న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ, తెలంగాణ ఏర్పాటును ప్రకటించింది.. తెలంగాణ ఏర్పాటుకు సమన్వయాన్ని సాధించేందుకు కేంద్రం, 2013 ఆగస్టు 6న 'ఆంటోని' కమిటీని నియమించింది. 2013 అక్టోబరు 3న కేంద్ర హోం శాఖ తయారు చేసిన తెలంగాణ నోట్ను కేంద్ర క్యాబినెట్ ఆమోదించింది.

2013 అక్టోబరు 8న ఆటోని ఆధ్యక్షతన గ్రూప్ ఆఫ్ మినిస్ట్రీస్ కమిటీని కేంద్రం నియమించింది.

* 2013 డిసెంబరు 5న ఏపీ పునర్విభజన బిల్లును పార్లమెంటు ఆమోదించింది.


+ 2013 డిసెంబరు 11న ఈ బిల్లును రాష్ట్రపతి ఆమోదించి  ఆంధ్రప్రదేశ్ కి పంపారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన బిల్లు 2013 డిసెంబరు 12న ఏపీకి చేరింది. ఈ బిల్లును రాష్ట్ర అసెంబ్లీలో 2013 డిసెంబరు 13న ప్రవేశపెట్టారు. 

2014 జనవరి 8న ఈ బిల్లుపై మొదటగా ప్రసంగించింది వట్టి వసంతకుమార్ ఈ బిల్లును అసెంబ్లీలో చర్చించేందుకు ఆరు వారాలు 42 రోజులను రాష్ట్రపతి కేటాయించారు. 

* 2014 జనవరి 25కు 42 రోజులు పూర్తికావడంతో మరో ఏడు రోజులు పొడిగించారు. 

* 2014 జనవరి 30న అసెంబ్లీలో 87 మంది ఎమ్మెల్యేలు మాట్లాడి 9072 సవరణలు సూచించగా, 54 మంది ఎమ్మెల్సీలు మాట్లాడి 1157 సవరణలు సూచించారు. అదే రోజు ఏపీ పునర్విభజన బిల్లును వ్యతిరేకిస్తూ 'మూజువాణి ఓటుతో ఆమోదించారు. . 

* 2014 ఫిబ్రవరి 18న బిల్లును లోక్సభ ఆమోదించింది. 2014 ఫిబ్రవరి 20న ఏపీ పునర్విభజన బిల్లును రాజ్యసభ ఆమోదించింది. 

* 2014 మార్చి 1న ఏపీ పునర్విభజన బిల్లు ఆమోదం పొందడంతో ఆది ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014గా మారింది. 

* 2014 మార్చి 4న కేంద్ర హోంశాఖ అసాధారణ రాజ పత్రంలో ప్రకటన చేస్తూ 'జూన్ 2ని 'అప్పాయింటెడ్ డే'గా ప్రకటించింది

0 Comments

Advertisements

Andhra Pradesh Jobs Updates


Telangana Job Updates


Govt. Jobs


Private Jobs


Bank Jobs Updates


Latest Railway Jobs


Latest Faculty Jobs


Defence / Police Jobs


Latest Walk in Interview's


Job Mela


Current Affairs


General Knowledge