September 3, 2019

ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ ఆంధ్రప్రదేశ్ వారికీ మాత్రమే

చెన్నై లోని ఆర్మీ హెడ్ క్వార్టర్స్ రిక్రూట్మెంట్ జోన్ వారు 07 అక్టోబర్ 2019 నుండి 17 అక్టోబర్ 2019 వతేదీవరకు 10 రోజులపాటు ఫార్మా విభాగంలో సిపాయి ఉద్యోగాలను భర్తీ చేయడానికి  తెలంగాణ రాష్ట్రము, కరీంనగర్ జిల్లాలో ఉన్న బిఆర్ అంబెడ్కర్ స్టేడియంలో ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఈ  ఉద్యోగాలకు కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 13 జిల్లాల నిరుద్యోగ అభ్యర్థులు మరియు కేంద్రపాలిత ప్రాంతమైన యానాం అభ్యర్థులు అర్హులు.


ఉద్యోగం పేరు :  ఫార్మా విభాగంలో సిపాయి


అర్హతలు :  ఇంటర్మీడియేట్ పాస్ మరియు డిఫార్మా లో కనీసం 55% మార్కులతో పాస్ లేదా బిఫార్మాలో 58% మార్కులతో పాస్ అయిఉండి స్టేట్ ఫార్మసి కౌన్సిల్ లేదా ఫార్మసీ కౌన్సిల్ అఫ్ ఇండియాలో రిజిస్టర్ అయి ఉండాలి.


వయసు 19 నుండి 25 సంవత్సరాల లోపు ఉండాలి.

ఈ ఉద్యోగాలకు డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఫిజికల్ ఫిట్ నెస్ టెస్ట్, వైద్యపరీక్షలు, చివరగా రాతపరీక్ష నిర్వహిస్తారు.

అర్హతలు ఉన్న అభ్యర్థులు 23 ఆగస్టు 2019 నుండి 22 సెప్టెంబర్ 2019 లోపు ఆర్మీ అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్నవారికి 23 సెప్టెంబర్ 2019 తరువాత అడ్మిట్ కార్డులు జారీ చేస్తారు. పూర్తి వివరాలకు నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోగలరు.
0 Comments