September 28, 2019

నిరుద్యోగులకు శుభవార్త - ప్రభుత్వ రంగ బ్యాంకులో 168 ఆఫీసర్ ఉద్యోగాలు

భారత ప్రభుత్వ అధీనంలో ఉంది ఢిల్లీ ప్రధాన కేంద్రంగా గల పంజాబ్ & సింద్ బ్యాంక్ ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ లో అర్హతలను బట్టి మొత్తం 12 రకాల ఉద్యోగాలు ఉన్నాయి. డిగ్రీ నుండి పిజి,బిటెక్ ,బీఈ అర్హతలు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులు, బ్యాంక్ ఉద్యోగాలకోసం ఎదురు చూసే వారికీ ఇది ఒక మంచి అవకాశం. నోటిఫికేషన్ వివరాలు క్రింద ఇవ్వబడ్డాయి. 

పోస్ట్ పేరు :  స్పెషలిస్ట్ ఆఫీసర్ 

మొత్తం ఉద్యోగాలు :  168 పోస్టులు 

పోస్టులు అర్హతల వివరాలు :  
1) అసిస్టెంట్ జనరల్ మేనేజర్ - లా 
అర్హత :  03 సంవత్సరాలు లేదా 05 సంవత్సరాల డిగ్రీ (లా) పాస్ వయసు 35 నుండి 45 సంవత్సరాలు. మరియు అనుభవం ఉండాలి. 

2) కంపెనీ సెక్రటరీ 
అర్హత :  ఏదయినా డిగ్రీ మరియు ఇన్స్టిట్యూట్ అఫ్ కంపెనీ సెక్రెటరీస్ నందు మెంబర్ గా ఉండాలి, వయసు 30 నుండి 40 సంవత్సరాలు. మరియు అనుభవం ఉండాలి. 

3) రాజభాష అధికారి 
అర్హత :  ఇంగ్లీష్ తో పాటు హిందీలో  పోస్ట్ గ్రాడ్యుయేట్ లేదా ఇంగ్లీష్ తో పాటు సంస్కృతం లో పోస్ట్ గ్రాడ్యుయేట్ వయసు 30 నుండి 40 సంవత్సరాలు. మరియు అనుభవం ఉండాలి. 

4) లా మేనేజర్ 
అర్హత :   03 సంవత్సరాలు లేదా 05 సంవత్సరాల డిగ్రీ (లా) పాస్, పోస్ట్ గ్రాడ్యుయేట్ లో లా పూర్తి చేసినవారికి ప్రాధాన్యత., వయసు 25 - 35 సంవత్సరాలు, మరియు అనుభవం 

5) ఫైర్  సేఫ్టీ ఆఫీసర్ 
అర్హత :   ఫైర్ ఇంజనీరింగ్ లో బీఈ లేదా బిటెక్ , వయసు 25 - 35 సంవత్సరాలు, మరియు అనుభవం 

6) సెక్యూరిటీ ఆఫీసర్ 
అర్హత :   డిగ్రీ , వయసు 25 - 35 సంవత్సరాలు, మరియు అనుభవం 

7) అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్ 
అర్హత :  అగ్రికల్చర్ / హార్టికల్చర్ / అనిమల్ హస్బెండరీ / వెటర్నరీ సైన్స్ / డైరీ సైన్స్ / ఫిషరీ సైన్స్ లో 4 సంవత్సరాల డిగ్రీ వయసు 20 - 30 సంవత్సరాలు, మరియు అనుభవం 

8) చార్టెడ్ అకౌంటంట్ 
అర్హత :  చార్టెడ్ అకౌంటెంట్ పాస్ మరియు వయసు 20 - 30 సంవత్సరాలు ఈ ఉద్యోగాలకు అనుభవం అవసరం లేదు 

9) సాఫ్ట్ వెర్ డెవలపర్ / ఐటి ప్రోగ్రామర్ 
అర్హత :  కంప్యూటర్ సైన్స్ / కంప్యూటర్ అప్లికేషన్ / ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లో 04 సంవత్సరాల ఇంజనీరింగ్ . వయసు 20 - 30 సంవత్సరాలు మరియు అనుభవం 

10) రాజభాష అధికారి (JMGS i)
అర్హత :   ఇంగ్లీష్ తో పాటు హిందీలో  పోస్ట్ గ్రాడ్యుయేట్ లేదా ఇంగ్లీష్ తో పాటు సంస్కృతం లో పోస్ట్ గ్రాడ్యుయేట్ వయసు 20 నుండి 30 సంవత్సరాలు. మరియు అనుభవం ఉండాలి. 

11) టెక్నికల్ ఆఫీసర్ 
అర్హత :   సివిల్ ఇంజనీరింగ్ లో డిగ్రీ లో 60% మార్కులతో పాస్ వయసు 20 నుండి 30 సంవత్సరాలు. మరియు అనుభవం ఉండాలి. 

12. టెక్నికల్ ఆఫీసర్ 
అర్హత :   ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో డిగ్రీ లో 60% మార్కులతో పాస్ వయసు 20 నుండి 30 సంవత్సరాలు. మరియు అనుభవం ఉండాలి. 

ఎంపిక విధానం :  షార్ట్ లిస్టింగ్, ఆన్లైన్ ఎక్జామినేషన్ , పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక జరుగుతుంది. 

పరీక్ష కేంద్రాలు :  గుంటూరు, కర్నూల్, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, వరంగల్. 

అప్లికేషన్ ఫీజు :  700 రూపాయలు, ఎస్సి, ఎస్టీ , పిడబ్ల్యుడి అభ్యర్థులకు 150 రూపాయలు 

అప్లై చేయు విధానం :  ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ లేదా ఆఫ్ లైన్ ద్వారా కూడా అప్లై చేసుకోవచ్చు, అఫ్ లైన్ లో దరకాస్తులను ప‌ంజాబ్ & సింధ్ బ్యాంక్‌, ఐదో అంత‌స్తు, బ్యాంక్ హౌజ్‌, 21 రాజేంద్ర ప్లేస్‌, న్యూదిల్లీ -110008 అనే అడ్రసుకు 17 అక్టోబర్ 2019 లోపు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవడానికి 10 అక్టోబర్ 2019 లోపు అప్లై చేసుకోవాలి. 



0 Comments

Advertisements

Andhra Pradesh Jobs Updates


Telangana Job Updates


Govt. Jobs


Private Jobs


Bank Jobs Updates


Latest Railway Jobs


Latest Faculty Jobs


Defence / Police Jobs


Latest Walk in Interview's


Job Mela


Current Affairs


General Knowledge