7 సెప్టెంబర్, 2019

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు | అప్పర్ డివిజన్ క్లర్క్ | Word/ Excel తెలిస్తే చాలు

ఇండియన్ ఇన్స్టిట్యూట్ అఫ్ ఆస్ట్రో ఫిజిక్స్ అనే జాతీయ విద్య సంస్థ నందు అప్పర్ డివిజన్ క్లర్క్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఎంపికయిన అభ్యర్థులు బెంగళూరు, కొడైకెనాల్ , కావ్యాలూర్, హొసకోటె , గౌరిబిదానూరు ప్రాంతాలలో పనిచేయాలి. ఇవి పూర్తిగా పర్మినెంట్ ఉద్యోగాలు. డిగ్రీ పాసై ఉండి కంప్యూటర్ నాలెడ్జ్ తెలిసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. ఉద్యోగాల వివరాలు క్రింద ఇవ్వబడ్డాయి.

పోస్టు పేరు :  అప్పర్ డివిజన్ క్లర్క్

మొత్తం ఉద్యోగాల సంఖ్య:  05 పోస్టులు

రిజర్వేషన్లు :  జనరల్ 03, ఓబిసి - 01 , ఎస్సి - 01

శాలరీ :  రూ.25,500 నుండి రూ.81,100 రూపాయలు

అర్హతలు :  ఆర్ట్స్ / సైన్స్ / కామర్స్ లలో బ్యాచిలర్ డిగ్రీని కనీసం 50% మార్కులతో పాస్ అయి ఉండాలి . కంప్యూటర్ అప్లికేషన్స్ అయినా వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్, తోపాటు ఇంటర్నెట్, టాలీ, ERP తెలిసి ఉండాలి. కనీసం 03 సంవత్సరాల పని అనుభవం ఉండాలి.

ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకున్నవారికి మొదట స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహిస్తారు అందులో అర్హత సాధించినవారికి రాతపరీక్ష మరియు స్కిల్ టెస్ట్ నిర్వహిస్తారు. రాతపరీక్షను బెంగళూరు లో నిర్వహిస్తారు.  రాతపరీక్షలో ఇంగ్లీష్, జనరల్ నాలెడ్జ్ మరియు అర్థమెటిక్,అడ్మినిస్ట్రేటివ్ నాలెడ్జ్ అంటే ఫండమెంటల్ రూల్స్, సప్లిమెంటరీ రూల్స్, జనరల్ ఫైనాన్సియల్ రూల్స్ , అకౌంట్స్ & ఫైనాన్స్, అకౌంటెన్సీ తదితరాలు ఉంటాయి.

అర్హతలు ఉన్న అభ్యర్థులు మొదట ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ లో రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్టర్ చేసుకున్న అప్లికేషన్ ప్రింట్ , ఎడ్యుకేషనల్ సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలను Administrative Officer, Indian Institute of Astrophysics, II Block, Kormangala, Bangalore – 560034 అనే చిరునామాకు 10 అక్టోబర్ 2019 లోపు చేరునట్లు పోస్ట్ ద్వారా పంపించాలి.

ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ ప్రారంభం 01 సెప్టెంబర్ 2019 నుండి చివరి తేదీ 30 సెప్టెంబర్ 2019 . అప్లై చేసుకున్నవారి ప్రింటెడ్ అప్లికేషన్లు పైన తెలిపిన చిరునామాకు చేరవలసిన చివరి తేదీ 10 అక్టోబర్ 2019. పూర్తి వివరాలకు క్రింద ఉన్న నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోగలరు.