7 సెప్టెంబర్, 2019

BECIL Recruitment 2019 | ఎనిమిదవ తరగతి అర్హతతో 3000 ప్రభుత్వ ఉద్యోగాలు

బ్రాడ్ కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్ ఇండియా లిమిటెడ్ (BECIL) నుండి కాంట్రాక్ట్ పద్దతిలో పనిచేయడానికి స్కిల్ల్డ్ మరియు నాన్- స్కిల్డ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయింది. ఎంపికయిన అభ్యర్థులు 01 అక్టోబర్ 2019 నుండి విధులలో చేరవలసి ఉంటుంది. ఉద్యోగాల వివరాలు క్రింద ఇవ్వబడ్డాయి.

మొత్తం 3000 ఉద్యోగాలకు ఈ నోటిఫికేషన్ విడుదల చేయగా ఇందులో స్కిల్డ్ మ్యాన్ పవర్ కేటగిరి క్రింద 1500 పోస్టులు మరియు నాన్-స్కిల్డ్ మ్యాన్ పవర్ కేటగిరి క్రింద 1500 పోస్టులు ఉన్నాయి.

స్కిల్డ్ మ్యాన్ పవర్ కేటగిరి ఉద్యోగాలకు  ఎలక్ట్రికల్ లో ఐటిఐ లేదా ఇంజనీరింగ్ లెవెల్ లో టెక్నికల్ డిగ్రీ ఉన్నవారు అర్హులు. నాన్ స్కిల్డ్ మ్యాన్ పవర్ కేటగిరి ఉద్యోగాలకు 8వతరగతి పాస్ అయినవారు అప్లై చేసుకోవడానికి అర్హులు .

అప్లికేషన్ ఫీజుగా జనరల్ / ఓబిసి అభ్యర్థులు 500 రూపాయలు చెల్లించాలి, ఎస్సి/ఎస్టీ/ పిహెచ్ అభ్యర్థులు 250 రూపాయలు చెల్లించాలి.

 అప్లై చేసుకున్నవారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ 16 సెప్టెంబర్ 2019 నుండి 20 సెప్టెంబర్ 2019 వరకు నిర్వహిస్తారు. ఎంపికయిన అభ్యర్థులు 01 అక్టోబర్ 2019 నుండి విధులలో చేరవలసి ఉంటుంది.

అర్హతలు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు 06 సెప్టెంబర్ 2019 నుండి 16 సెప్టెంబర్ 2019 లోపు ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి.