August 13, 2019

నేషనల్ ఇన్స్టిట్యూట్ అఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

నేషనల్ ఇన్స్టిట్యూట్ అఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ నుండి అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయింది. ఈ సంస్థ కేంద్ర ప్రభుత్వ గుర్తింపు పొంది ఉంది దేశవ్యాప్తంగా 16 చోట్ల అనుబంధ  కళాశాలలు ఉన్నాయి. ఈ ఉద్యోగాలను 05 సంవత్సరాల కాలానికి కాంట్రాక్ట్ పద్దతిలో భర్తీ చేస్తారు.

మొత్తం 179 అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలకు ఈ నోటిఫికేషన్ విడుదలయింది. ఇందులో జనరల్ 74 పోస్టులు, ఎస్సి 26 పోస్టులు, ఎస్టీ 13 పోస్టులు, ఓబిసి 49 పోస్టులు, ఏడబ్ల్యూఎస్ 17 పోస్టులు మరియు వికలాంగులకు 07 పోస్టులు ఉన్నాయి.

ఈ ఉద్యోగాలకు అర్హతలుగా పోస్ట్ గ్రాడ్యుయేషన్ లో 55% మార్కులు లేదా సంబంధిత సబ్జెక్ట్ లో పిహెచ్ డి తో పాటు పని అనుభవం ఉండాలి. వయసు అప్లికేషన్ చివరి తేదీ నాటికీ 40 ఏళ్లలోపు ఉండాలి. రిజర్వేషన్ వర్గాలవారికి రిజర్వేషన్లు వర్తిస్తాయి.

రాతపరీక్ష , ఇంటర్వ్యూ ద్వారా ఈ ఉద్యోగాలకు ఎంపిక జరుగుతుంది. ఇందులో మూడు పార్టులు ఉంటాయి మొదటి పార్ట్ 50 మార్కులకు రెండవ పార్ట్ 50 మార్కులకు నిర్వహిస్తారు మొదటి రెండు పార్ట్ లలో అధిక మార్కులు వచ్చిన వారికీ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.

అప్లికేషన్ ఫీజుగా జనరల్ మరియు ఓబిసి అభ్యర్థులు 1000 రూపాయలు చెల్లించాలి మిగతావారికి ఫీజు లేదు.

అర్హతలు ఉన్న అభ్యర్థులు https://nift.ac.in/ అనే  వెబ్సైట్ ద్వారా 06 సెప్టెంబర్ 2019 లోగా ఆన్లైన్ లో  అప్లై చేసుకోవాలి. వివరాలకు క్రింద ఉన్న నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు.




0 Comments