August 19, 2019

భారత నౌకా నిర్మాణ సంస్థలో 1980 ఉద్యోగాలకు నోటిఫికేషన్

భారత రక్షణ శాఖ పరిధిలో పనిచేసే దేశంలోని అతి పెద్ద షిప్ బిల్డింగ్ కంపెనీ అయిన మజ్ గాన్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ నుండి వివిధ ఉద్యోగాల భర్తీకి  నోటిఫికేషన్ విడుదల చేశారు. పదవతరగతి తో పాటు ఐటిఐ లో అర్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు 05 సెప్టెంబర్ 2019 లోపు  అప్లై చేసుకోవాలి. 

మజ్ గాన్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ నుండి విడుదలయిన నోటిఫికేషన్ లో మొత్తం 1980 పోస్టులు ఉన్నాయి. వీటిలో సెమి స్కిల్డ్, స్కిల్డ్, పర్సనల్ విభాగాలలో ఖాళీలు ఉన్నాయి. 

ఈ ఉద్యోగాలకు పోస్టులను బట్టి పదవతరగతి, ఐటిఐ , డిప్లొమా తోపాటు అనుభవం ఉండాలి. వయసు 01 ఆగస్టు 2019 నాటికీ 18 నుండి 38 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎంపికయిన వారు రెండు సంవత్సరాలు కాంట్రాక్ట్ పద్దతిలో పనిచేయవలసి ఉంటుంది. 

అప్లై చేసుకున్న అభ్యర్థులకు రాతపరీక్ష, ఇంటర్వ్యూ నిర్వహించి ఈ ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు . ఇందులో రాతపరీక్ష కు 30% , అనుభవానికి 20% మరియు ట్రేడ్ టెస్ట్ కు 50% మార్కులు ఉన్నాయి. 

అర్హులయిన అభ్యర్థులు జనరల్ / ఓబిసి అభ్యర్థులు 100రూపాయల  ఫీజు చెల్లించి ఆన్లైన్ ద్వారా 14 ఆగస్టు 2019 నుండి 05 సెప్టెంబర్ 2019 లోపు అప్లై చేసుకోవాలి.  అభ్యర్థులకు ఫీజు లేదు. మరింత సమాచారం కోసం నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోవడానికి లింక్ క్రింద ఇవ్వబడింది. 




0 Comments

Advertisements

Andhra Pradesh Jobs Updates


Telangana Job Updates


Govt. Jobs


Private Jobs


Bank Jobs Updates


Latest Railway Jobs


Latest Faculty Jobs


Defence / Police Jobs


Latest Walk in Interview's


Job Mela


Current Affairs


General Knowledge