August 21, 2019

ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బ్యాంక్ లో ఉద్యోగాలకు నోటిఫికేషన్

భారత దేశంలోనే కాకుండా విదేశాలలో కలిపి మొత్తం 19 శాఖలతో అతిపెద్ద బ్యాంక్ ఆయిన ఎక్స్పోర్ట్ - ఇంపోర్ట్ బ్యాంకు అఫ్ ఇండియా నుండి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగంలో ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయింది.

అర్హులయిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు 21 ఆగస్టు 2019 నుండి 09 సెప్టెంబర్ 2019 లోగా ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి. ఈ ఉద్యోగాలకు ఎంపికయినవారికి నెలకు 42,020 రూపాయల నుండి 45,950 వరకు వేతనం ఉంటుంది.

మొత్తం ఈ నోటిఫికేషన్ 07 ఉద్యోగాలు ఉండగా ఇందులో డిప్యూటీ మేనేజర్ 04 పోస్టులు, మేనేజర్ 03 పోస్టులు ఉన్నాయి.

మేనేజర్ (షేర్ పాయింట్ / నెట్ డెవెలపర్) ఉద్యోగాలకు కంప్యూటర్ సైన్స్ / ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ / ఎలెక్ట్రోనిస్ & కమ్యూనికేషన్ లలో బీఈ/బిటెక్ లో 60% మార్కులతో పాస్ అయిఉండాలి లేదా మాస్టర్ అఫ్ కంప్యూటర్ అప్లికేషన్ లో 60% మార్కులతో పాస్ అయి ఉండాలి. కనీసం 03 సంవత్సరాల పని అనుభవం ఉండాలి.

డిప్యూటీ మేనేజర్ ఉద్యోగాలకు 01ఆగస్టు 2019 నాటికీ 28 ఏళ్లలోపు, మేనేజర్ ఉద్యోగాలకు 32 ఏళ్లలోపు ఉండాలి, రిజర్వేషన్లు వర్తిస్తాయి.

అప్లై చేసుకున్న అభ్యర్థులకు రాతపరీక్ష  మరియు పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపికచేస్తారు. రాతపరీక్షను 05 అక్టోబర్ 2019న ఇంటర్వ్యూ ను 01 నవంబర్ 2019న నిర్వహిస్తారు.

అర్హులయిన అభ్యర్థులు దరకాస్తు ఫీజుగా 600 రూపాయలు , పిడబ్ల్యుడి  అభ్యర్థులు 100 రూపాయలు చెల్లించి ఎక్జిమ్  బ్యాంక్ యొక్క వెబ్సైట్ ద్వారా 09 సెప్టెంబర్ 2019లోగా ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి. వివరాలకు క్రింద ఉన్న నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోగలరు. 
0 Comments