August 16, 2019

బ్యాంక్ అఫ్ బరోడా లో 25 ప్రొఫెషనల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్

బ్యాంక్ అఫ్ బరోడా నుండి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగం లో ప్రొఫెషనల్ ఉద్యోగాలను కాంట్రాక్ట్ పద్దతిలో భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదలయింది.

మొత్తం 25 ఉద్యోగాలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఇందులో డేటా అనలిస్ట్ 04 పోస్టులు , డేటా మేనేజర్ 02 పోస్టులు ,డేటా ఇంజినీర్ 04  పోస్టులు ,బిజినెస్ అనలిస్ట్ 02 పోస్టులు ,మొబిలిటీ & ఫ్రంట్ ఎండ్ డెవలపర్ 06  పోస్టులు ,ఇంటెగ్రేషన్ ఎక్స్పర్ట్ 02 పోస్టులు , ఎమర్జింగ్ టెక్నాలజీ ఎక్స్పర్ట్ 04 పోస్టులు ,టెక్నాలజీ అర్చిటెక్ 01  పోస్టు ఉన్నాయి.






ఈ ఉద్యోగాలకు అర్హతలుగా పైన తెలిపిన పోస్టులకు సంబంధిత సబ్జెక్ట్ లలో బ్యాచిలర్ డిగ్రీ, ఇంజనీరింగ్ డిగ్రీ, పోస్టులను బట్టి అర్హతలతో పటు అనుభవం ఉండాలి. అభ్యర్థులకు వయసు 25 - 40 సంవత్సరాల మధ్య ఉండాలి.

అప్లికేషన్ ఫీజుగా జనరల్ & ఓబిసి అభ్యర్థులు 600/- రూపాయలు ఎస్సి,ఎస్టీ, పిడబ్ల్యుడి అభ్యర్థులు 100 రూపాయలు చెల్లించాలి.

ఈ ఉద్యోగాలకు షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థులకు ముందుగా కాల్ లెటర్ పంపిస్తారు, వారికి ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.

అర్హులయిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు 02 సెప్టెంబర్ 2019 లోగా బ్యాంక్ అఫ్ బరోడా యొక్క వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి.




0 Comments

Advertisements

Andhra Pradesh Jobs Updates


Telangana Job Updates


Govt. Jobs


Private Jobs


Bank Jobs Updates


Latest Railway Jobs


Latest Faculty Jobs


Defence / Police Jobs


Latest Walk in Interview's


Job Mela


Current Affairs


General Knowledge