August 9, 2019

సికిందరాబాద్ లో ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ

తెలంగాణ రాష్ట్రం, సికిందరాబాద్ లో ఉన్న ఆర్మీ రిక్రూట్మెంట్ ఆఫీస్ వారు కరీంనగర్ జిల్లా లో ఉన్న డాక్టర్ బి..ఆర్ అంబెడ్కర్ స్టేడియం లో అక్టోబర్ 07 వతేది నుండి 17 అక్టోబర్ 2019 వరకు ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఈ ర్యాలీలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన 31 జిల్లాల అభ్యర్థులు పాల్గొనవచ్చు.

ఈ రిక్రూట్మెంట్ ర్యాలీ ద్వారా జనరల్ డ్యూటీ, టెక్నికల్, నర్సింగ్ అసిస్టెంట్, క్లర్క్, స్టోర్ కీపర్, ఫార్మసి, ట్రేడ్స్ మెన్ విభాగాలలో సోల్జర్ పోస్టులను భర్తీ చేయనున్నారు.

ఈ ఉద్యోగాలకు అర్హత పోస్టులను బట్టి ఎనిమిదో తరగతి నుండి ఇంటర్, డిపార్మాసి, బి ఫార్మసి పాస్ అయి ఉండి , ఆర్మీ వారు నిర్దేశించిన శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి. వయసు 17 సంవత్సరాల నుండి 23 సంవత్సరాల లోపు ఉండాలి, పచ్చ బొట్లు ఉన్నవారు అనర్హులు

ఈ ఉద్యోగాలకు ముందుగా రన్నింగ్ టెస్ట్, మెడికల్ టెస్ట్ ఉంటుంది. అందులో పాస్ అయిన వారికీ చివరగా రాతపరీక్ష నిర్వహించి ఎంపిక చేస్తారు.

అర్హులయిన తెలంగాణ రాష్ట్రానికి చెందిన 31జిల్లాల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా 23 ఆగస్టు 2019 నుండి 22 సెప్టెంబర్ 2019 లోపు అప్లై చేసుకోవాలి. ఈ ఉద్యోగులకు ఎటువంటి దరఖాస్తు ఫీజు లేదు.
0 Comments