August 7, 2019

నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ నాన్ - ఎక్జిక్యూటివ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

భారత ప్రభుత్వ మినీరత్న సంస్థ అయిన నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ నుండి బటిండా (పంజాబ్),  పానిపట్ (హర్యానా), విజయ్ పూర్ (మధ్యప్రదేశ్), నంగల్ , కార్పొరేట్ ఆఫీస్, మార్కెటింగ్ డివిజన్ లలో పనిచేయడానికి నాన్-ఎక్జిక్యూటివ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయింది.

వివరాలు : 

పోస్టు పేరు :  నాన్ - ఎక్జిక్యూటివ్

మొత్తం ఖాళీలు :  41 పోస్టులు

పోస్టుల వివరాలు : 
1) లోకో ఆపరేటర్ - గ్రేడ్ 3
అర్హతలు : పదవతరగతి తో పాటు ఐటిఐ లో టర్నర్, ఫిట్టర్, వెల్డర్, మెషనిస్ట్, డీజిల్ మెకానిక్, లోకో మెకానిక్, మోటార్ మెకానిక్ మెషిన్ టూల్ మెకానిక్, ఆటో ఎలక్ట్రీషియన్

2) స్టోర్ అసిస్టెంట్ - గ్రేడ్ -2
అర్హత :  ఏదయినా డిగ్రీ

3) ఆఫీస్ అసిస్టెంట్ గ్రేడ్ - 3
అర్హత :  ఏదయినా డిగ్రీ

4) లోకో అటెండెంట్ -గ్రేడ్ -3
అర్హత :  పదవతరగతి తో పాటు  2 సంవత్సరాల పని అనుభవం

వయసు : 30 ఏళ్లలోపు ఉండాలి

అప్లికేషన్ ఫీజు :  ఎస్సి/ఎస్టీ/ పిడబ్ల్యుడి, ఎక్స్ సర్వీస్ మెన్ లకు ఫీజు లేదు, మిగతా వారు 200/- ఫీజు చెల్లించాలి.

అర్హతలు ఉన్న అభ్యర్థులు ఆన్లైన్ లో 06 ఆగస్టు 2019 నుండి 05 సెప్టెంబర్ 2019 లోపు అప్లై చేసుకోవచ్చు.
0 Comments