August 20, 2019

వరంగల్ జిల్లాలో జూనియర్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలు

వరంగల్ జిల్లాలో ఉన్న కాళోజి నారాయణ రావు యూనివర్సిటీ అఫ్ హెల్త్ సైన్సెస్ నుండి జూనియర్ అసిస్టెంట్, జూనియర్ స్టెనోగ్రాఫర్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదలయింది. 

ఈ ఉద్యోగాలను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీచేయనున్నారు. ఆసక్తి , అర్హులయిన అభ్యర్థులు 18 ఆగస్టు 2019 నుండి 09 సెప్టెంబర్ 2019 లోపు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి. 

మొత్తం ఈ నోటిఫికేషన్ లో 19 ఉద్యోగాలు ఉన్నాయి ఇందులో జూనియర్ అసిస్టెంట్ 15 పోస్టులు , జూనియర్ స్టెనోగ్రాఫర్ 04 ఉద్యోగాలు ఉన్నాయి . ఈ ఉద్యోగాలకు ఎంపికయిన వారికీ నెలకు 49,870 వేతనం ఇవ్వనున్నారు. 

జూనియర్ అసిస్టెంట్ 15 ఉద్యోగాలకు విద్యార్హత కంప్యూటర్ సైన్స్ లేదా సంబంధిత సబ్జెక్ట్ తో డిగ్రీ పాస్ అయి ఉండాలి వయసు01 జులై 2019 నాటికీ  34 ఏళ్లలోపు ఉండాలి, అలాగే జూనియర్ స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలకు కంప్యూటర్ సైన్స్ లేదా సంబంధిత సబ్జెక్ట్ లో డిగ్రీ పాస్ అయి ఉండి టైపు రైటింగ్ హయ్యర్ గ్రేడ్ పాస్ మరియు షార్ట్ హ్యాండ్ పాస్ అయి ఉండాలి. 

ఈ ఉద్యోగాలకు రాత పరీక్ష నిర్వహిస్తారు. అందులో మెరిట్ ఉన్నవారికి ఇంటర్వ్యూలు నిర్వహించి ఎంపిక చేస్తారు. రాతపరీక్షలో జనరల్ కేటగిరి అభ్యర్థులకు 40%, బిసి అభ్యర్థులకు 35%, ఎస్సి,ఎస్టీ,వికలాంగులు 30% మార్కులు అర్హత మార్కులు. 

అర్హతలు ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకునేటప్పుడు జనరల్ అభ్యర్థులు 800 రూపాయలు, ఎస్సి, ఎస్టీ , బిసి అభ్యర్థులు , వికలాంగులు 500 రూపాయలు ఫీజుగా చెల్లించాలి. ఈ ఫీజును నెట్ బ్యాంకింగ్, డెబిట్/క్రెడిట్ కార్డు ద్వారా కూడా చెల్లించవచ్చు. పూర్తి వివరాలకు నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. 




0 Comments

Advertisements

Local Small Business !deas


Private Jobs


Andhra Pradesh Jobs Updates


Telangana Job Updates


Govt. Jobs


Bank Jobs Updates


Latest Railway Jobs


Latest Faculty Jobs


Defence / Police Jobs


Latest Walk in Interview's


Job Mela