July 19, 2019

గ్రామ సచివాలయ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల డేట్ || AP Sachivalaya Notification Release Date Out

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నిర్ణయాలలో గ్రామ సచివాలయాలు ఒకటి. ఈ ఉద్యోగ నోటిఫికేషన్ ద్వారా దాదాపు 1,33,867 ఉద్యోగాలను భర్తీ చేయాలనీ భావిస్తున్నారు. కాగా ఇందులో ఉద్యోగాలకు సంబందించిన ఉద్యోగ నియామక ప్రకటన మరో 03 రోజుల పాటు వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. 
వాస్తవానికి 15 జులై 2019 న గ్రామ సచివాలయ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల అవుతుందని గతంలో ప్రకటించినప్పటికీ ఈ నోటిఫికేషన్ లో పోస్టుల సంఖ్య, వయసు పరిమితి , అలాగే కేంద్రం ప్రవేశ పెట్టిన EWS రిజర్వేషన్ , మరియు ఈ ఉద్యోగాల సిలబస్ ఏమిటి అనే విషయాలపైన ఒక అవగాహన రావడంలో ఈ నోటిఫికేషన్ విడుదల ఆలస్యం అవుతోందని ఈ అంశాలపైన స్పష్టత వచ్చాకే ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు పంచాయతీ రాజ్ ప్రిన్సిపాల్ సెక్రటరీగా నియమితులయిన గోపాల కృష్ణ త్రివేది తెలిపారు. 

నిన్న రాష్ట్ర మంత్రి వర్గం ఆమోదం తెలుపడంతో రెండు మూడు రోజుల్లో ఈ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యే అవకాశం ఉందని ఆయన తెలిపారు. 

ఈ ఉద్యోగాలకు డిస్ట్రిక్ట్ సెలెక్షన్ కమిటీ (డిఎస్సి)ద్వారా రాత పరీక్ష నిర్వహించి అత్యంత పారదర్శకంగా ఈ ఉద్యోగాలకు నియామకాలు నిర్వహిస్తామని అలాగే అప్లై చేసుకునే అభ్యర్థులు దళారులను నమ్మి మోసపోవద్దని ఆయన తెలిపారు. 

మొత్తం మీద ఈ ఉద్యోగాలకు సంబందించిన విధివిధానాలపైనా వేగంగా కసరత్తు జరుగుతోంది. జులై 22 సోమవారం నాడు ఈ ఉద్యోగాలకు ఉద్యోగ ప్రకటన వెలువడే అవకాశం ఉంది. 

0 Comments

Advertisements

Local Small Business !deas


Private Jobs


Andhra Pradesh Jobs Updates


Telangana Job Updates


Govt. Jobs


Bank Jobs Updates


Latest Railway Jobs


Latest Faculty Jobs


Defence / Police Jobs


Latest Walk in Interview's


Job Mela