గ్రామ వలంటీర్లకు గురువారం నుంచి ప్రతి మండలంలోనూ ఇంటర్వ్యూలు ప్రారంభం కాబోతున్నాయి. మండలానికి 700కి పైగా దరఖాస్తులు వచ్చిన చోట అదనంగా ఇంటర్వ్యూ బోర్డులను ఏర్పాటు చేసుకోవాలని జిల్లా కలెక్టర్లకు సూచించారు.
➤ ఇంతవరకు ఉన్న పంచాయతీ లను ఇప్పుడు కొత్త గా సచివాలయం గా ఏర్పాటు చేస్తున్నారు.
➤ ఇలా ఏర్పాటు చేయడం ద్వారా ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు మరియు సామాన్యులకు అందడం జరుగుతుంది.
పంచాయతీ
➤ ఇప్పుడు ఒక్కో పంచాయతీలో ఒక గ్రామ సచివాలయం నడుస్తోంది.
➤ అక్కడ నుంచే సర్పంచులు, కార్యదర్శులు పరిపాలన చేసేవారు.
➤ సచివాలయంలో ఏర్పాటు కాగానే పథకాల మంజూరుతో పాటు, పలు రకాల సేవలను సచివాలయాల నుంచే అందించేందుకు రూపకల్పన జరుగుతోంది.
సచివాలయాలను ఎలా ఏర్పటు చేస్తారు?
➤ సచివాలయాలను జనాభా ప్రతిపాదికన ఏర్పాటు చేస్తున్నారు.
➤ రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు కనీసం రెండు వేల జనాభాకో సచివాలయాన్ని ఏర్పాటు చేయనున్నారు
గ్రామ వాలంటీర్ ఇంటర్వ్యూ -
2011లో తీసిన జనాభా లెక్క ఆధారంగా
➤ 2011లో తీసిన జనాభా లెక్క ఆధారంగా మరియు ఈ జనాభా కు 15% జనాభాను కలిపి లెక్కకడతారు.
➤ రెండు వేల జనాభాపై ఉన్న పంచాయతీని ఒక సచివాలయం ఏర్పాటు చేసారు.
➤ రెండు వేల కంటే తక్కువ జనాభా ఉన్న పంచాయతీలను రెండు లేదా మూడింటిని కలిపి ఒకే సచివాలయం ఏర్పాటు చేస్తారు.
ఆంధ్రప్రదేశ్ లో సచివాలయాల్లో 8 శాఖలు
1. వ్యవసాయం శాఖ
2. .పశుసంవర్థక శాఖ
3. రెవెన్యూ శాఖ
4. వైద్య శాఖ
5. .ఉద్యాన శాఖ
6. అటవీ శాఖ
7. సంక్షేమ శాఖ
8. పంచాయతీరాజ్ శాఖ
సచివాలయాల్లో శాఖలు నుంచి పది మంది ఉద్యోగులు ను కొత్త గా నియమిచడం జరుగుతుంది.
ఈ సచివాలయంలకు అనుసంధాన కర్త గా గ్రామ వాలంటీర్ వ్యవహరిస్తారు.
తనకు కేటాయించిన కుటుంబాలలో కలిగే విద్య , వైద్య సమస్యల పైన సచివాలయంలో పిర్యాదు చేస్తారు.
ఈ ప్రజా సమస్యలను 72 గంటలలో సచివాలయలు పరిష్కరించాలి. అక్టోబర్ రెండో తేదీ నాటికి వారు విధుల్లో చేరేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు.
2.ఆంధ్రప్రదేశ్ లో వాలంటీర్
➤ ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు ను నేరుగా తనకు కేటాయించిన ఇల్లు కు చేర్చడం కోసం ప్రభుత్వం వాలంటీర్ ను నియమిస్తుంది.
➤ వాలంటీర్ సచివాలయం కు మరియు తనకు కేటాయించిన కుటుంబాలకు మధ్య వారధిగా పనిచేస్తారు.
➤ వాలంటీర్ ను ప్రాంతాలను బట్టి రెండు రకాలుగా విభజించారు.
1. గ్రామ వాలంటీర్
2. వార్డ్ వాలంటీర్
వాలంటీర్ గౌరవ వేతనం
వాలంటీర్ల నెలకు రూ.5 వేలు గౌరవ వేతనం ప్రభుత్వం ఇస్తుంది.
గ్రామ వాలంటీర్ విధులు
➤ వాలంటీర్ విధులు తమకు కేటాయించిన కుటుంబాలకు ఎప్పటికప్పుడు ప్రభుత్వ పథకాలను చేరవేయాలి.
➤ అ కులం, మతం, రాజకీయంతో సంబంధం లేకుండా అర్హులందరికీ ప్రభుత్వ పథకాలను అందించాలి.
➤ తమ పరిధిలోని కుటుంబాల అంటే తనకు కేటాయించిన కుటుంబాల సమస్యలను ప్రభుత్వానికి తెలియజేయాలి.
➤ ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య అనుసంధానకర్తలుగా వ్యవహరించాలి.
➤ ఉన్నతాధికారులు అప్పగించిన ఇతర విధులను కూడా నిర్వహించాల్సి ఉంటుంది.
➤ ప్రాథమిక సర్వే నిర్వహించడం
➤ కుటుంబాల సమగ్ర సమాచారం సేకరించడం ప్రజల అవసరాలు, సమస్యలు తెలుసుకోవడం
➤ గ్రామ సచివాలయంతో సమన్వయంతో పని చేయడం
➤ ఇళ్ల ముంగిటకే సేవలు అందించడం
➤ ప్రజా సమస్యలు, వినతుల పరిష్కారానికి ప్రభుత్వ శాఖల అధికారులతో సమన్వయంతో పనిచేయడం
➤ విద్య, వైద్య సదుపాయాల కల్పన ప్రజల మెరుగైన జీవనోపాధికి నైపుణ్యాలు అందించటం జరుగుతుంది
వాలంటీర్లను ఎప్పుడు తొలగిస్తారు.
➤ వాలంటీర్ విధులు సరిగా నిర్వహించుకున్న
➤ పనితీరు సంతృప్తికరంగా లేకుంటే వాలంటీర్లను తొలగిస్తారు.
వార్డ్ వాలంటీర్
➤ పట్టణాల్లో ప్రతి 100 కుటుంబాలకు ఒక వార్డు వాలంటీరును నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
➤ 110 పుర పాలక్క నగరపాలక సంస్థల్లో ఈ నియామకాలను చేపడతారు.
➤ దీని వల్ల 40,500 మందికి వార్డు వాలంటీర్లుగా వస్తారు.
➤ గ్రామ వాలంటీర్ ఏమి విధులు నిర్వాహిస్తాడో అవే పనులు వార్డ్ వాలంటీర్ కూడా చెయ్యవసి ఉంటుంది
3.నవరత్నాలు
• పేదలకు అండగా నవరత్నాల హామీలను కలిపి YSRCP మేనిఫెస్టోను రూపొందించారు.
• నవరత్నాలు 9 అవి,
1. వైఎస్ఆర్ రైతు భరోసా
2. ఫీజు రీయింబర్స్ మెంట్
3. ఆరోగ్యశ్రీ
4. జలయజ్ఞం
5. మద్యపాన నిషేధం
6. అమ్మ ఒడి
7. వైఎస్ఆర్ ఆసరా
8. పేదలందరికీ ఇళ్లు
9. పెన్షన్ల పెంపు
వైఎస్ఆర్ రైతు భరోసా
➤ అన్నదాతకు మేలు చేకూర్చాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వస్తోంది.
➤ గత ప్రభుత్వం అమలు చేసిన అన్నదాత సుఖీభవ పథకాన్ని రద్దు చేసి.. దాని స్థానంలో వైఎస్ఆర్ రైతు భరోసా పథకాన్ని ప్రవేశపెట్టింది.
➤ ఈ పథకాన్ని 2019అక్టోబరు 15వ తేదీ నుంచి అమలు చేయాలని నిర్ణయించింది.
➤ ఐదెకరాలలోపు భూమివున్న రైతులకు ఏటా 12 వేల 500 రూపాయలు పెట్టుబడి సాయంగా అందజేస్తారు.
➤ ఈ పథకం వల్ల జిల్లాలో 4.92 లక్షల మంది రైతులకు ప్రయోజనం చేకూరే అవకాశాలు ఉన్నాయి.
➤ వీరుగాక భూమి లేని కౌలు రైతులు 60 వేల మంది వరకు ఉన్నారు.
➤ వీరందరికీ పెట్టుబడి సాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
➤ వ్యవసాయానికి పగటిపూటే 9 గంటల ఉచిత విద్యుత్. ఎలాంటి అంతరాయం లేకుండా క్వాలిటీ కరెంట్. దీంతో రైతులకు కరెంటు ఛార్జీల భారం తగ్గుతుంది. బ్యాంకుల నుంచి రైతన్నలకు వడ్డీలేని రుణాలు. తద్వారా రైతులకు పెట్టుబడి భారం తగ్గుతుంది. సాగు విస్తీర్ణం పెరిగి వారి ఆదాయం పెరుగుతుంది. రైతులందరికీ ఉచితంగా బోర్లు. సాగు నీటి కోసం రైతులు తాహతకు మించి బోర్లు వేస్తూ కుదేలవుతున్నారు. అందువల్ల ప్రభుత్వమే ఉచితంగా బోర్లు వేయిస్తుంది. తద్వారా రైతుల ఆత్మహత్యలు కూడా నివారిస్తాం.
ధరల స్థిరీకరణ నిధి
➤ రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తాం.
➤ రైతులు పంట వేసినప్పుడే కొనుగోలు ధర నిర్ణయిస్తాం.
➤ ప్రతి మండలంలో కోల్డ్ స్టోరేజీల ఏర్పాటు.
➤ పుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు.
ప్రకృతి వైపరీత్యాల నిధి
➤ రూ. 4 వేల కోట్లతో ప్రకృతి వైపరీత్యాల నిధి.
➤ రాష్ట్రం నుంచి రూ. 2 వేల కోట్లు, కేంద్రం నుంచి రూ. 2 కోట్లతో ఈ రిలీఫ్ ఫండ్. కరవు, తుఫాన్లు సంభవించినప్పుడు రైతులకు దీని ద్వారా పరిహారం.
➤ తుఫాన్ల కారణంగా దెబ్బతిన్న కొబ్బరిచెట్లకు ఒక్కొక్కదానికి రూ. 3 వేల పరిహారం.
➤ జీడి తోటలకు చంద్రబాబు సర్కారు ప్రకటించిన రూ. 30 వేల సాయం రూ. 50 వేలకు పెంపు
➤ ప్రతి జిల్లాకు సహకార డైరీలు.
➤ అక్కడ పాలు పోసే రైతులకు లీటరుకు రూ. 4 బోనస్.
➤ అప్పుడు ప్రైవేట్ డైరీలు కూడా పోటీకి వస్తాయి కాబట్టి రైతులకు మరింత మేలు.
➤ రైతులకు రూ. 5 లక్షలతో 'వైఎస్సార్ బీమా'. ప్రమాదవశాత్తూ రైతు మరణిస్తే.. అతడి కుటుంబానికి రూ.5 లక్షల ఇన్సూరెన్స్ సొమ్ము అందేలా చర్యలు.
➤ ఇన్సూరెన్స్ మొత్తం ప్రభుత్వమే భరిస్తుంది.
ఫీజు రీయింబర్స్మంట్
➤ ఈ పథకం కింద పేద వారి చదువుకు అయ్యే ఖర్చును పూర్తిగా భరి స్తారు.
➤ అంతేకాకుండా వసతి, భోజనం కోసం ఏటా రూ.20 వేలు ప్రతి విద్యార్థికి అందజేస్తారు.
ఆరోగ్యశ్రీ
➤ వార్షికాదాయం రూ. 5 లక్షలు దాటని అన్ని వర్గాల వారికి ఆరోగ్య శ్రీ వర్తింపు
➤ వైద్యం ఖర్చు రూ. 1000 దాటితే ఆరో గృశ్రీ క్రింద వర్తిపు.
➤ పూర్తిగా నయం అయ్యేంత వరకు ప్రభుత్వం ఖర్చు బరిస్తుంది.
➤ కిడ్నీ మరియు తలసేమియా వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారికి నెలకు రూ.10 వేల పెన్షన్ ఇస్తారు. ఏ వ్యాధులు ఆరోగ్యశ్రీ క్రింద కు వస్తాయి.
➤ అన్ని రకాల వ్యాధులు, ఆపరేషన్లు ఆరో గ్యశ్రీ పరిధిలోకి వస్తాయి.
➤ ఆపరేషన్ లేదా జబ్బు చేసిన వ్యక్తికి విశ్రాంతి సమయంలో ఆ కుటుంబానికి
ఆర్థిక సహాయం వంటి కార్యక్రమాలను ఈ పథకం ద్వారా నిర్వహిస్తారు.
➤ ఆరోగ్య శ్రీ సేవలను ఇతర రాష్ట్రాల్లో కూడా వినియోగించుకునే వెసులుబాటు కల్పిస్తూ నిర్ణయం
జలయజ్ఞం
➤ వైస్సార్ జలయజ్ఞం క్రింద రాష్ట్రం లో పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేస్తారు
➤ పోలవరం , పులా సుబ్బయ్య వెలిగొండ పూర్తి చేస్తారు
➤ ఇతర ప్రాజెక్టులు పూర్తి చేస్తారు.
➤ చెరువులను పునరుద్దరణ
➤ జలకళ ను తీసుకొని వస్తారు.
➤ దీని ద్వారా రాష్ట్రంలో లో త్రాగు నీరు మరియు సాగు నీరు అందుతాయి.
మద్యపాన నిషేధం
➤ రాష్ట్రం లో 3 దశల్లో మధ్య పాన నిషేధం చేస్తారు.
➤ Five స్టార్ హోటల్లో మాత్రమే మద్యపానం ను అనుమతి ఇస్తారు.
➤ బెల్టు షాపులు నిసేదిస్తారు.
➤ రాష్ట్రం లో మద్యపానం లేకుండా చేస్తారు.
➤ 2024 నాటికి పూర్తిగా నిషేధం.
అమ్మ ఒడి
➤ 2020 జనవరి 26నుండి అమఒడి పధకం ప్రారంభం పిల్లలను బడికి పంపే తల్లులకు ఏటా రూ. 15,000 తొలి కేబినెట్ సమావేశంలోనే అమ్మఒడి పథకం అమలుకు ఆమోదముద్ర
➤ తల్లి తన పిల్లనను బడికి పంపితే చాలు తల్లి బ్యాంకు ఖాతాలో రూ. 15 వేలు జమ చేస్తారు.
➤ తెల్ల రేషన్ కార్డు ఉండి, పిల్లలు చదువుకునే ప్రతి తల్లి బ్యాంకు ఖాతాలో రూ. 15 వేలు జమ చేస్తారు.
➤ 1 నుంచి ఇంటర్మీడియట్ చదువుకొనే విద్యార్థులు
➤ తెల్ల రేషన్ కార్డ్ కలిగి ఉండాలి. ఏ స్కూల్స్ కు ఈ పథకం క్రింద వస్తాయి?
➤ ప్రైవేట్ మరియు గవర్నమెంట్ పాఠశాలలో చదువుకునే విద్యార్థులు కూడా వస్తారు.
➤ హాస్టల్ లో మరియు రెసిడెన్షియల్ పాఠశాలో చదుకొనే వారు కూడా అర్హులు లబ్ది
➤ పిల్లలు చదువుకునే ప్రతి తల్లి బ్యాంకు ఖాతాలో రూ. 15 వేలు జమ చేస్తారు
➤ అమ్మ ఓడి అములు తేది 26 జనవరి 2020
వైఎస్ ఆర్ ఆసరా
➤ సున్నా, వడ్డీకే రుణాలు ఈ పథకం క్రింద ఇస్తారు.
➤ SC, ST, BC, మైనారిటీ అక్కచెల్లెమ్మలకు తోడుగా ఈ పథకం ఉంటుంది.
➤ 89 లక్షల మంది డ్వాక్రా మహిళలకు సంబంధించిన రుణాలను నాలుగు విడతల్లో మాఫీ చేస్తారు.
➤ 45 ఏళ్లు నిండిన ప్రతీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు మొదటి
ఏడాది తర్వాత రూ.75వేలు ఇస్తారు. ఎప్పుడు తీసుకున్న రుణాలను మాఫీ చేస్తారు
➤ ఎలెక్షన్ వరకు అంటే ముందు ఉన్న డ్వాక్రా రుణాలను మాఫీ చేస్తారు.
➤ 89 లక్షల మహిళాలు లబ్ది పొందుతారు.
➤ 75 వేలు రూపాయిలు వరకు లబ్ది పొందుతారు
పేదలందరికీ ఇళ్లు
➤ ఈ పథకం కింద ఇళ్లు లేని పేదలందరికీ ఇళ్లు నిర్మించి ఇస్తారు.
➤ ఇందులో భాగంగా వచ్చే ఉగాది నాటికి రాష్ట్రంలో అర్హులందరికీ ఇళ్ల స్థలాలను పంపిణీ చేయాలని నిర్ణయించారు.
➤ దీని క్రింద 25లక్షల ఇళ్లను నిర్మిస్తారు.
➤ పేదలు అందరికి సొంత ఇల్లు మరియు పట్టాలు.
పెన్షన్ల పెంపు
➤ మే 8న ప్రమాణస్వీకారం చేసిన వెంటనే ముఖ్యమంత్రి పింఛన్ల పెంపు దస్తంపై తొలి సంతకం చేశారు.
➤ వైస్సార్ పెన్షన్ కనుక గా పేరు మార్చారు.
➤ వృద్దులు అర్హత వయ సును 65 నుంచి 60 ఎళ్లకు తగ్గించారు.
➤ వైస్సార్ పెన్షస్ కనుక 12రకాల పెన్షన్ లు వస్తాయి అవి
1. వృద్ధులకు,
2. వితంతువులకు
3. ఒంటరి మహిళలకు, |
4. చేనేత కార్మికులకు,
5. గీత కార్మికులకు,
6. మత్స్యకారులకు,
7. కళాకారులకు,
8. డప్పు కళాకారులకు
9. దివ్యాంగులకు,
10. హిజ్రాలకు,
11. చర్మతోలు వృత్తిదారులకు
12. డయాలసిస్ రోగులకు
➤ వృద్దులు కు పింఛను పెంపులో భాగంగా రూ. 2 వేలను రూ నుంచి 250కు పెంచారు.
➤ ఇప్పుడు అంటే మొదటి నెల 2250 రూపాయలు మొదటి సంవత్సరం ఇస్తారు .
➤ ఇలా ప్రతి సంవత్సరం 250 రూపాయలు పెంచుకుంటూ 3000 రూపాయల వరుకు పెన్షన్ ఇస్తారు . 2వ సంవత్సరం 250 ను పెంచి 2500 రూపాయలు ఇస్తారు. 3వ సంవత్సరం 250 ను పెంచి 2750 రూపాయలు ఇస్తారు. 4వ సంవత్సరం 250 ను పెంచి 3000 రూపాయలు ఇస్తారు.
వికలాంగులకు నెలకు రూ.3 వేల పింఛను ఇస్తారు.
➤ డయాలసిస్ రోగులకు నెలకు రూ.10 వేల పింఛను ఇస్తారు.
➤ జులై 8 2019 నుంచి అమలు చేస్తారు
➤ అర్హత వయసును 65 నుంచి 60 ఎళ్లకు తగ్గించారు.
➤ దీని వల్ల కొత్తగా 5.50 లక్షల మందికి పింఛను అందే అవకాశం దక్కుతుంది.
4.సన్న బియ్యం పంపిణీ
➤ పౌరసరఫరాల శాఖ ద్వారా నాణ్యమైన బియ్యం పంపిణీ.
➤ 5, 10, 15 కిలోల బియ్యం సంచులను సెప్టెంబర్ 1 నుంచి నేరుగా ఇంటికే డోర్ డెలివరీ.
➤ గ్రామ వాలంటీర్, వార్డ్ వాలంటీర ద్వారా వారికి కేటాయించిన కుంటుబాలకు పంపిణీ
➤ సెప్టెంబర్ 1 నుంచి నేరుగా ఇంటికే డోర్ డెలివరీ.
➤ రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డులున్న 1.47 కోట్ల కుటుంబాలకు దీని క్రింద లబ్ది పొందుతాయి.
➤ కల్తీలేని, తినేందుకు అనువైన సన్న బియ్యాన్ని సెప్టెంబర్ 1వ తేదీ నుంచి పేదలకు పంపిణీ చేస్తామన్నారు.
5.మధ్యాహ్న భోజనం
➤ YSR అక్షయ పాత్ర గా పేరు మార్పు
➤ మధ్యాహ్న భోజనాన్ని సెంట్రలైజ్ కిచెన్ ద్వారా సరఫరా
➤ 40 కి.మీ. పరిధిలో పెద్ద కిచెన్ ఏర్పాటు అక్కడ నుంచి పాఠశాలకు పంపిణీ.
➤ మధ్యాహ్న భోజన పథకం లో పని చేసి వారికి 3000 వేతనం ఇస్తారు.
➤ భోజనం లో నాణ్యత
6.స్పందన
➤ ప్రజా పరిష్కర వేదిక
➤ స్పందన - ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లో ఏ
శాఖకు సంబంధించిన అర్జీ సమస్య గురించి సంబంధిత శాఖకు పంపవచ్చును.
➤ సంభందిత వారి అర్జీ తగు చర్య కోసం సంభందిత అధికారులకు పంపబడుతుంది.
➤ ప్రజల యొక్క సమస్యలను ఆర్జి రూపం లో స్పదన వెబ్ సైట్ లో రాయ వచ్చును.
➤ ఈ వెబ్ సైట్ ప్రజల కు మరియు ప్రభుత్వ ని మధ్య వారధి గా పనిచేస్తుంది.
➤ ఎక్కడ నుంచి అయ్యిన సమస్యను దీనిలో రాయవచ్చును.
➤ చిన్న సమస్య దీని ద్వారా 72 గంటలలో పరిష్కరించబదుతుంది.
➤ దీనికి 24 గంటలపాటు పనిచేసే కాల్ సెంటర్ ను అనుసంధానం చేయనున్నారు.
➤ స్పందన కోసం కొత్తగా 1800-425-4440 టోల్ ఫ్రీ నంబరు, spandana.ap@gmail.com మెయిల్ ను కేటాయించారు.
➤ కేవలం ఫిర్యాదులే కాదు వివిధ విషయాలపై ప్రభుత్వానికి సూచనలు, సలహాలు కూడా చేస్తుంటారు.
0 Comments
Post a Comment