July 22, 2019

పోస్ట్ ఆఫీస్ లో 10వతరగతి ఉద్యోగాలు | Post Office Recruitment of staff car drivers under Hyderabad Region

ది మేనేజర్ ,డిపార్ట్మెంట్ అఫ్ పోస్ట్స్ , మెయిల్ మోటార్ సర్వీస్, కోఠి స్టాఫ్ కార్ డ్రైవర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎంపికయిన వారు నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం, ఆదిలాబాద్, పెద్దపల్లి, మహబూబ్ నగర్ మరియు హైదరాబాద్ రీజియన్ లలోని తెలంగాణ పోస్టల్ సర్కిల్ ల పరిధిలో పనిచేయాలి.  



వివరాలు :  

పోస్టు పేరు :  స్టాఫ్ కార్ డ్రైవర్ 

మొత్తం ఖాళీల సంఖ్య :  06  పోస్టులు ఉండగా ఇందులో జనరల్ కేటగిరికి 03, ఓబిసి కేటగిరి 02, ఎస్టీ అభ్యర్థులకు ఒక పోస్టును కేటాయించారు. 

శాలరీ :  రూ 19,900/- (ఏడవ వేతన సంఘం సిఫార్సుల ప్రకారం) 

అర్హత :  ప‌దో త‌ర‌గ‌తి ఉత్తీర్ణ‌త‌తో పాటు లైట్ & హెవీ మోటార్ వెహికిల్ లైసెన్స్ క‌లిగి ఉండాలి. అలాగే మోటార్ మెకానిజం లో కనీస అనుభవం ఉండాలి. కనీసం 03 సంవత్సరాలు డ్రైవింగ్ అనుభవం ఉండాలి, హోమ్ గార్డ్ లేదా సివిల్ వాలంటీర్ గా 03 సంవత్సరాల అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఇస్తారు. 

వయసు :  18 నుండి 27 ఏళ్ల మధ్య ఉండాలి. ఓబిసి అభ్యర్థులకు 03 ఏళ్ళు మరియు గవర్నమెంట్ సర్వెంట్స్ కు 40 ఏళ్ల వయసు వరకు అప్లై చేసుకోవడానికి అర్హులు 

ఎంపిక విధానం :  సింపుల్ అర్థ‌మాటిక్ టెస్ట్‌, వాహ‌న మెకానిజం, డ్రైవింగ్ టెస్ట్ ఆధారంగా.

అర్హులయిన అభ్యర్థులు తమ బయోడేటా మరియు సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలను The Manager, Mail Motor Service, Koti, Hyderabad - 500 095.అనే అడ్రసుకు 14 ఆగస్టు 2019 లోగా పోస్టు ద్వారా పంపించవలసి  ఉంటుంది. 



0 Comments