June 4, 2019

Jobs in Kurnool District Library Department

ఆంధప్రదేశ్ పౌర గ్రంథాలయ శాఖ సంచాలకులు వారి ఉత్తర్వులు ఆర్.సి. నెం.18-3/2018 తేది: 5.2. 2018లో అనుమతించిన మరియు కర్నూలు జిల్లా కలెక్టర్ మరియు మేజిస్ట్రేట్ జిల్లా గ్రంథాలయ సంస్థ ఎంపిక సంఘం చైర్మన్ వారి ఆదేశాల ప్రకారము కర్నూలు జిల్లా గ్రంథాలయ సంస్థలో ఖాళీగా ఉన్న ఈ దిగువ తెలిపిన పోస్టులకు వాటి ఎదురుగా తెలిపిన కేటగిరీలకు చెందిన స్థానిక అభ్యర్థుల నుంచి నేరుగా భర్తీ చేయుటకు దరఖాస్తులు కోరడమైనది.


మొత్తం ఖాళీల సంఖ్య :  05 పోస్టులు 

పోస్టుల వివరాలు : 
1) లైబ్రేరియన్  గ్రేడ్ 03 - 02 పోస్టులు (General)
అర్హత : ఇంటర్మీడియేట్ మరియు సర్టిఫికెట్ అఫ్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ (CSISc) కోర్సులో ఉత్తీర్ణత కలిగి ఉండాలి
వయోపరిమితి :  01-07-2019 నాటికి గరిష్టంగా 42 సంవత్సరాలు మించరాదు. 

2) లైబ్రేరియన్ గ్రేడ్ 03 - 01 పోస్టు (బ్యాక్ లాగ్)
అర్హత : ఇంటర్మీడియేట్ మరియు సర్టిఫికెట్ అఫ్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ (CSISc) కోర్సులో ఉత్తీర్ణత కలిగి ఉండాలి
వయసు :  01-07-2019 నాటికి గరిష్టంగా 47 సంవత్సరాలు మించరాదు 

3) ఆఫీస్ సబార్డినేట్ - 02 పోస్టులు (బ్యాక్ లాగ్) 
అర్హత :  గుర్తింపు పొందిన పాఠశాల నుండి 08వతరగతి పాస్ 
వయసు :  01-07-2019 నాటికి గరిష్టంగా 47 సంవత్సరాలు మించరాదు 

ఎంపిక విధానము :   ఎంపిక రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ ద్వారా జరుగును.

అప్లికేషన్ ఫీజు :  రూ. 100/- విలువ కలిగిన డి.డి. కార్యదర్శి జిల్లా గ్రంథాలయ సంస్థ, కర్నూలు వారి పేరున చెల్లించాలి 

అప్లై చేయు విధానము :   అర్హతగల అభ్యర్థులుతమ బయోడేటా ఫారంకు గెజిటెడ్ అధికారిచే ధ్రువీకరించిన విద్యార్హత సర్టిఫికెట్స్ 4వ తరగతి నుండి 10వ తరగతి వరకు సర్టిఫికేట్స్ (స్థానికత కొరకు) లేటేస్ట్ కుల ధ్రువీకరణ పత్రము, వయస్సు నిర్ధారణ సర్టిఫికేట్లతో పాటు జిల్లా ఉపాధి కల్పనా కార్యాలయంలో నమోదు చేసి కొనినయెడల ఎంప్లాయిమెంట్ రిజిస్ట్రేషన్ కార్డు, రెండు పాస్ పోర్ట్ సైజు ఫోటోలు మరియు సొంత చిరునామా గల రెండు కవర్లను రూ. 25/- విలువ కలిగిన పోస్టల్ స్టాంపులు అంటించి తేది: 20.6.2019 సాయంత్రం 5 గం||లలోపు కార్యదర్శి, జిల్లా గ్రంథాలయ సంస్థ, చిదంబర రావు వీధి, పాత బస్టాండ్ దగ్గర, కర్నూలు-518001 వారికి చేరునట్లు పంపవలెను.

Note :  అభ్యర్థులు రెండేసి పోస్టులకు దరఖాస్తు చేయునప్పుడు, దరఖాస్తులను విడివిడిగా పంపవలెను.

0 Comments

Advertisements

Andhra Pradesh Jobs Updates


Telangana Job Updates


Govt. Jobs


Private Jobs


Bank Jobs Updates


Latest Railway Jobs


Latest Faculty Jobs


Defence / Police Jobs


Latest Walk in Interview's


Job Mela


Current Affairs


General Knowledge