June 24, 2019

How to Apply Grama Volunteer Jobs | Step by Step in Telugu | వాలంటీర్ ఉద్యోగాలకు దరకాస్తు ఎలా చేయాలి?

ఆంధ్రప్రదేశ్ లో నిరుద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న గ్రామ వాలంటీర్ ఉద్యోగాలకు అధికారికంగా నోటిఫికేషన్ విడుదలైంది.

వెబ్ సైట్లో దరఖాస్తు ఎలా నింపాలంటే.. 
First Step : ధ్రువీకరణ 
• ప్రాంతం, విద్యార్హత, పుట్టిన తేదీ ఆప్షన్లు సెలెక్ట్ చేసి 'Check' బటన్ క్లిక్ చేయాలి. 

Second Step: అభ్యర్థి ప్రామాణికం 
• ఆధార్ నంబరు నమోదుచేసి 'Sent OTP' బటన్ పై క్లిక్ చేయాలి.  ఆధార్ కు లింక్ అయిన మొబైల్ నంబరుకు ఓటీపీ వస్తుంది. ఆ నంబరు నమోదు చేసి 'Verify OTP' బటన్ క్లిక్ చేయాలి. 

* ఆధార్ లేకుంటే మొబైల్ నంబరుతో రిజిస్ట్రేషన్ చేసుకొని  "Adhaar Not Available" బటన్ క్లిక్ చేయాలి. మరోసారి మొబైల్ నంబరు నమోదు చేసి 'Sent OTP' బటన్ క్లిక్ చేస్తే మొబైల్ నంబరు వస్తుంది. దీన్ని నమోదు చేసి 'Verify OTP'  బటన్ క్లిక్ చేయాలి. 

Third Step : వ్యక్తిగత సమాచారం
అభ్యర్థి పేరు, లింగం, తండ్రి పేరు, పుట్టిన తేదీ ఎంపిక చేసు కొని Verify Adhaar బటన్ పై క్లిక్ చేయాలి. తరువాత దశలో ఫొటోను Upload చేసి బటన్ పై క్లిక్ చేయాలి. 

• చిరునామా నమోదు చేసి నివాస నిర్ధరణకు ఓటర్, రేషన్ కార్డు పీడీఎఫ్ ఫైల్ ని అప్లోడ్ చేసి 'Edit Button" క్లిక్ చేయాలి. తరువాత క్రమంలో మొబైల్ నంబరు నమోదు చేసి 'Send OTP' బటన్ క్లిక్ చేయడంతో మొబైల్ కి ఓటీపీ నంబరు వస్తుంది. దీన్ని నమోదు చేసి 'Verify OTP' బటన్ క్లిక్  చేయాలి. 

Fourth Step : విద్యార్హత 
• ఇంటర్మీడియట్ బోర్డు, విశ్వవిద్యాలయం, రిజిస్ట్రేషన్ నంబరు, ఉత్తీర్ణత గ్రేడ్, ఉత్తీర్ణులైన ఏడాది, వచ్చిన మార్కులు (శాతం), ఎడ్యుకేషన్ సర్టిఫికెట్లు అప్లోడ్ చేసి 'గో అండ్ కంటిన్యూ' బటన్ క్లిక్ చేయాలి.

Fifth Step: సామాజిక వివరాలు
ఓసీ వర్గానికి చెందిన వారైతే రేడియో బటన్ 'YES' ఎంపిక చేయాలి. అంగవైకల్యం లేనట్లయితే 'NO' ఎంపిక చేసుకోవాలి. డిక్లరేషన్ సెలెక్ట్ చేసుకొని 'Apply' బటన్ పై క్లిక్ చేయాలి. 

• ఓసీ వర్గానికి చెందని వారైతే రేడియో బటన్ 'NO' సెలెక్ట్ చేయాలి.

కుల ధ్రువీకరణ పత్రం ఐడీని నమోదు చేసి 'Verify Details' పై క్లిక్ చేస్తే అభ్యర్థి వివరాలు ప్రదర్శితమవుతాయి. 'Choose File' బటన్ పై Click  చేసి సర్టిఫికెట్లను ఎంపికచేసుకొని 'Upload' బటన్ పై క్లిక్ చేయాలి. . అంగ వైకల్యం కలిగి ఉంటే రేడియో బటన్ 'YES' ఎంపిక చేసు కోవాలి. వైకల్యం రకం, ధ్రువీకరణ ఐడీని నమోదు చేసి ''Choose File'' బటన్ పై క్లిక్ చేసి సర్టిఫికెట్ని ఎంపిక చేసి 'Upload' బటన్ పై క్లిక్ చేయాలి. 

* అన్ని వివరాలు పూర్తి చేశాక 'OK' బటన్ క్లిక్ చేస్తే దరఖాస్తు విజయవంతమై ID Number వస్తుంది.

0 Comments

Advertisements

Andhra Pradesh Jobs Updates


Telangana Job Updates


Govt. Jobs


Private Jobs


Bank Jobs Updates


Latest Railway Jobs


Latest Faculty Jobs


Defence / Police Jobs


Latest Walk in Interview's


Job Mela


Current Affairs


General Knowledge