June 25, 2019

East Godavari Municipal Corporation 3,021 Ward Volunteer Jobs | తూర్పు గోదావరి జిల్లాలో వార్డు వాలంటీర్ ఉద్యోగాలు

తూర్పు గోదావరి జిల్లాలోని అన్ని నగరపాలక సంస్థలు / పురపాలిక సంఘాలు, మరియు నగర పంచాయతీలలో ప్రతి 100 కుటుంబాలకు ఒకరు చొప్పున సుమారు 3,021 మంది వార్డు వాలంటీర్ ఉద్యోగాల భర్తీకి అర్హులయిన అభ్యర్ధులనుండి ఆన్లైన్ లో దారకాస్తులు కోరుతున్నారు. 

ప్రభుత్వము ద్వారా అందించే వివిధ అభివృద్ధి సంక్షేమ పధకాలను మరియు నవరత్నాలను ప్రజల చేరువకు తీసుకెళ్ళే బాధ్యత నగరపాలక మరియు పురపాలక సంస్థ పై ఉన్నది. ఈ భాద్యతను సక్రమముగా నిర్వహించుట కొరకు నగరపాలక మరియు పురపాలక వార్డు వాలంటీర్లను నియమించుటకు ప్రభుత్వము నిర్ణయించినది. ప్రజలకు నగరపాలక మరియు పురపాలక సంస్థలకు మధ్య అనుసంధాన కర్తలుగా పనిచేయుటకు అర్హులై ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువతీ యువకులు దరఖాస్తు చేసుకొనవచ్చును. 

ఈ అనుసంధాన కర్తలు వార్డు వాలంటీర్లగా పిలువబడతారు. మెరుగైన ఇతర ఉద్యోగాలు వచ్చే వరకు వార్డు వాలంటీర్లు సమాజ సేవా దృక్పథంతో పనిచేయవచ్చును. 

నగరపాలక / పురపాలక / నగరపంచాయతీల వారీగా ఖాళీలు : 
1) కాకినాడ   - 750  పోస్టులు 
2) రాజమండ్రి  - 1033 పోస్టులు 
3)అమలాపురం - 154 పోస్టులు 
4)మండపేట - 167 పోస్టులు 
5)రామచంద్రపురం - 135 పోస్టులు 
6)పెద్దాపురం - 125 పోస్టులు 
7)సామర్ల కోట - 130 పోస్టులు 
8)పిఠాపురం - 157 పోస్టులు 
9) తుని - 157  పోస్టులు
10) ముమ్మిడివరం - 69  పోస్టులు
11) ఏలేశ్వరం - 87  పోస్టులు
12) గొల్లప్రోలు - 58  పోస్టులు

వార్డు వాలంటీర్ల విధులు : 
ఆ వార్డు వాలంటీర్లు తమకు కేటాయించిన 100 కుటుంబాలనునగరపాలక మరియు పురపాలక సంస్థలతో అనుసంధానము చేసి ప్రభుత్వ పథకాల లబ్దిని వారి ఇంటి దగ్గరకి చేరవేయవలెను. 

ఆ కుటుంబాల సమస్యలను నగరపాలక మరియు పురపాలక సంస్థల ద్వారా ప్రభుత్వానికి తెలియజేయవలెను. వార్డు వాలంటీర్లు ఫలాపేక్షణ లేకుండా విధులు నిర్వహించినందులకు గాను, పనితీరు ఆధారముగా, గౌరవ వేతనము గరిష్టంగా రూ. 5000/-లు నెలకు ఇవ్వబడును. 

అర్హతలు : ధరఖాస్తుదారు డిగ్రీ ఉత్తీర్ణులై ఉండవలెను. వార్డు వాలంటీర్లుగా ఏ వార్డులో పనిచేయాలని ఆశిస్తున్నారో, ఆ వార్డుకు చెందిన వారై ఉండాలి. 

వయసు :  30.06.2019 నాటికి 18 సంవత్సరములు నిండిన వారై 35 సంవత్సరములు దాటని వారై ఉండాలి. ఈ నిబంధనల ప్రకారము రీజర్వేషన్లు వర్తిస్తాయి. మహిళలకు దాదాపు 50% రిజర్వేషన్లు వర్తిస్తాయి. 

ఎంపిక విధానము : • ప్రతి వార్డులో ప్రతి 100 కుటుంబాలకు ఒక వాలంటీరు ఎంపిక చేయబడును. ఈ పనిని మునిసిపల్ స్థాయి కమిటీ నిర్వహిస్తుంది. 

1. ప్రభుత్వ పథకములు, కార్యక్రమాలు, సంక్షేమ పథకములపై అభ్యర్థుల అవగాహన. 
2. సామాజిక సమస్యలు మరియు వారు నివసించే ప్రాంతములో ప్రజలు ఎదుర్కొంటున్న స్థానిక సమస్యలు. 
3. NGOs/ సాంఘిక కార్యక్రమాలలో / సంస్థలలో అభ్యర్థులకు అనుభవముపై 
4. నాయకత్వపు లక్షణములు మరియు భావ వ్యక్తీకరణ నైపుణ్యముపై. 
5. అభ్యర్థి వ్యక్తిత్వము మరియు సేవ చేసే సామర్ధ్యం  అంశములపై మౌఖిక పరీక్ష నిర్వహించి తద్వారా వార్డు  వాలంటీర్లుగా ఎంపిక చేయబడును

దరఖాస్తు చేసుకొను విధానము :  ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువతీ, యువకులకు ఆన్ లైన్ ద్వారా ఈ http://wardvolunteer.ap.gov.in వెబ్ సైట్ నందు దరఖాస్తు చేసుకొనవచ్చును.  ఇ ఆధార్ నెంబరు, విద్యార్హతల ధృవీకరణ పత్రము, కుల ధృవీకరణ పత్రము, నివాస ధృవీకరణ పత్రము తదితర ధృవీకరణ పత్రములు ఆన్లైన్ నందు అప్ లోడ్ చేయవలెను.

ముఖ్యమైన తేదీలు : 
దరఖాస్తు స్వీకరణ నోటిఫికేషన్ 24.06.2019 
ధరఖాస్తు స్వీకరణ తేదీలు 24.06.2019 నుండి 05.07.2019 వరకు. 
దరఖాస్తుల పరిశీలన  10.07.2019 వరకు 
సెలక్షన్ కమిటీ ద్వార మౌఖిక పరీక్ష 11.07.2019 నుండి 25.07.2019
వాలంటీర్ల ఎంపికైన వివరములు తెలుపు తేది 01.08.2019 6. 
శిక్షణా తరగతులు 05.08.2019 నుండి 10.08.2019 వరకు. 
వాలంటీర్లు పనిచేయుటకు ప్రారంభించుటకు తేది  15.08. 2019 

0 Comments