June 25, 2019

ఆంధ్రప్రదేశ్ లో 41,000 వార్డ్ వాలంటీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్

ఆంధ్రప్రదేశ్ లోని పట్టణాలలో 100 కుటుంబాలకు ఒక వాలంటీర్ చొప్పున మొత్తం 41,000 ఉద్యోగాలకు సోమవారం ఆయా జిల్లాల కలెక్టర్లు నోటిఫికేషన్లు విడుదల చేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో 110 పురపాలిక, నగరపాలిక సంస్థలలో ఈ నియామకాలను చేపట్టనున్నారు.  

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం ఇదివరకే ప్రతి 50 కుటుంబాలకు ఒక గ్రామ వాలంటీర్ ను నియమించడానికి నోటిఫికేషన్లు విడుదల చేసింది. ఇప్పుడు పట్టణాలలో ప్రతి 100 కుటుంబాలకు ఒక వార్డ్ వాలంటీర్ ను నియమించనున్నారు.  2011 జనాభా లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పట్టణాలలో 38,68,811 కుటుంబాలు ఉన్నాయి. 

అయితే గ్రామ వాలంటీర్ ఉద్యోగాలకు 10వతరగతి , ఇంటర్మీడియట్ అర్హతలుగా ఉండగా పట్టణాలలో వార్డ్ వాలంటీర్ ఉద్యోగాలకు మాత్రం డిగ్రీ అర్హత ఉండాలి. 

గ్రామ వాలంటీర్ అభ్యర్థులతో సమానంగా వీరికి కూడా నెలకు 5,000 రూపాయలు గౌరవ వేతనం ఇవ్వనున్నారు. వయసు 30 జూన్ 2019 నాటికి 18 నుండి 35 ఏళ్ల లోపు ఉండాలి, 

ఈ వార్డ్ వాలంటీర్ ఉద్యోగాలకు అప్లై చేసిన వారిని ఆయా పట్టణ కమిషనర్, తహసీల్దార్, పట్టణ పేదరిక నిర్ములన సంస్థ (మెప్మా) ప్రాజెక్ట్ అధికారి, మరియు పట్టణ మిషన్ సమన్వయకర్త లతో ఏర్పాటైన కమిటీ చేత ఉద్యోగాలకు ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు. ఉద్యోగాలలో గ్రామ వాలంటీర్ ఉద్యోగాలకు ఉన్నట్లే మహిళలకు 50% రిజర్వేషన్లు కల్పించారు. 

ఆసక్తి, అర్హత ఉన్న పట్టణ ప్రాంత నిరుద్యోగులు ఈ ఉద్యోగాలకు http://www.wardvolunteer.ap.gov.in అనే వెబ్సైట్ ద్వారా 24 జూన్ 2019 నుండి 05 జులై 2019 లోపు ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి. 

వార్డ్ వాలంటీర్ విధులు : 
1) ప్రాథమిక సర్వే నిర్వహణ 
2) కుటుంబాల సమగ్ర సమాచారం 
3) ప్రజల అవసరాలు, సమస్యలు తెలుసుకోవడం 
4) గ్రామ సచివాలయం తో సమన్వయంతో పనిచేయడం 
5) ఇంటి ముంగిటికే సేవలు అందిచడం 
6) ప్రజల సమస్యలు, వినతుల పరిష్కరానికి ప్రభుత్వ శాఖల అధికారులతో సమన్వయంతో పనిచేయడం 
ప్రజల వ్యక్తిగత రక్షణ, భద్రతా, విద్య, వైద్య సదుపాయాల కల్పన, ప్రజల మెరుగైన జీవనోపాధికి నైపుణ్యాలు అందించడం, అర్హులందరికీ ప్రభుత్వ సేవలు అందించడం
7) రహదారులు, వీధి దీపాలు, కాలువలు, తాగునీరు, సామజిక, వ్యక్తిగత పరిశుభ్రత 

0 Comments