April 12, 2019

sbi clerk 2019 notification pdf download | State Bank Of India 8904 Clerk Jobs Notification 2019

బ్యాంక్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు భారతీయ స్టేట్ బ్యాంకు తీపికబురు అందించింది. 8904 క్లర్క్  భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. కేవలం డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులకే కాకుండా పైనల్ ఇయర్/సెమిస్టర్ చదువుతున్న అభ్యర్థులకు కూడా పరీక్ష రాసుకునే సౌలభ్యం కల్పించింది. ఆసక్తి అర్హతలు కలిగిన అభ్యర్థులు స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా యొక్క వెబ్సైట్ ద్వారా 12 ఏప్రిల్ 2019 నుండి 03 మే 2019 లోగా  ఆన్లైన్ లో  చేసుకోవాలి.

వివరాలు : 

పోస్టు పేరు :  క్లర్క్

శాలరీ :   25,000/-

మొత్తం పోస్టుల సంఖ్య :  8904 పోస్టులు ఉండగా ఇందులో ఆంధ్ర ప్రదేశ్ లో 253 పోస్టులు, తెలంగాణాలో 464 (425 రెగ్యులర్ + 39 బ్యాక్ లాగ్) ఉన్నాయి.

అర్హతలు :  31 ఆగస్టు 2019 నాటికి ఏదయినా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి డిగ్రీ పాస్ అయి ఉండాలి. కేవలం డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులకే కాకుండా పైనల్ ఇయర్/సెమిస్టర్ చదువుతున్న అభ్యర్థులకు కూడా పరీక్ష రాసుకునే సౌలభ్యం కల్పించింది.

వయసు :  01 ఏప్రిల్ 2019 నాటికి 20 నుండి 28 ఏళ్ళ మధ్య ఉండాలి. అంటే అభ్యర్థులు 02 ఏప్రిల్ 1991 నుండి 01 ఏప్రిల్ 1999 సంవత్సరాల మధ్యన జన్మించి ఉండాలి. ఎస్సి,ఎస్టీ వారికీ 05 ఏళ్ళు, ఓబిసి వారికీ 3 ఏళ్ళు వయసుపరిమితిలో సడలింపుఉంటుంది.

అప్లికేషన్ ఫీజు : జనరల్,ఓబిసి, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు 750 రూపాయలు మరియు ఎస్సి, ఎస్టీ, పిడబ్ల్యుడి, ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు 125 రూపాయలు అప్లికేషన్ ఫీజును ఆన్లైన్ ద్వారా చెల్లించాలి.

ఎక్జామ్ సెంటర్లు :  మొత్తం దేశవ్యాప్తంగా 74 సెంటర్లలో ఎక్జామ్ నిర్వహిస్తారు ఇందులో రెండు తెలుగు రాష్ట్రాలలో ఆంధ్ర ప్రదేశ్ లో Chirala, Chittoor, Eluru, Guntur, Kadapa, Kakinada, Kurnool, Nellore, Ongole, Rajahmundhry, Srikakulam, Tirupati, Vijaywada, Vishakhapatnam, Vizianagaram

తెలంగాణ :  Hyderabad, Karimnagar, Khammam, Warangal

ఎంపిక విధానం :  ప్రిలిమినరీ, మెయిన్ ఎక్జామినేషన్ మరియు ఇంటర్వ్యూ ఆధారంగా,

ఎక్జామ్ ఎలా ఉంటుంది :   ఆన్లైన్ లో నిర్వహించే ఈ  ప్రిలిమినరీ ఎక్జామ్ ను మొత్తం 100 మార్కులకు నిర్వహిస్తారు. ఇందులో ఇంగ్లీష్ లాంగ్వేజ్ 30 మార్కులకు, న్యూమెరికల్ ఎబిలిటీ 35 మార్కులకు, రీజనింగ్ ఎబిలిటీ 35 మార్కులకు మొత్తం 100 మార్కులకు పరీక్ష  నిర్వహిస్తారు , పరీక్షా సమయం ఒక గంట.  ఇందులో నెగటివ్ మార్కింగ్ విధానం ఉంది . ఇందులో క్వాలిఫై అయిన వారికి మెయిన్ ఎక్జామ్ నిర్వహిస్తారు. ఇది అబీజెక్టివ్ విధానం లో ఉంటుంది. ఇందులో జనరల్/ఫైనాన్సియల్ అవెర్ నెస్ నుండి 50 మార్కులకు, జనరల్ ఇంగ్లీష్ నుండి 40 మార్కులకు, ఆప్టిట్యూడ్ నుండి 50 మార్కులకు, రీజనింగ్ ఎబిలిటీ & కంప్యూటర్ ఆప్టిట్యూడ్ నుండి 60 మార్కులకు మొత్తం 200 మార్కులకు 190 ప్రశ్నలు వస్తాయి పరీక్షా సమయం 2 గంటల 40 నిమిషాలు. పరీక్షను తెలుగులోకూడా నిర్వహిస్తారు. 

ఆసక్తి అర్హతలు కలిగిన అభ్యర్థులు స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా యొక్క వెబ్సైట్ ద్వారా 12 ఏప్రిల్ 2019 నుండి 03 మే 2019 లోగా  ఆన్లైన్ లో  చేసుకోవాలి

ముఖ్యమైన తేదీలు :  
1) ఆన్లైన్ లో దరకాస్తులు ప్రారంభం : 12-04-2019
2) దరకాస్తు చేసుకోవడానికి చివరి తేదీ :  03- 05-2019
3) ప్రిలిమినరీ ఎక్జామ్  :  జూన్ 2019
4) మెయిన్ ఎక్జామ్ 10-08-2019

Apply Online
 Notification
 Official Website

0 Comments

Advertisements

Andhra Pradesh Jobs Updates


Telangana Job Updates


Govt. Jobs


Private Jobs


Bank Jobs Updates


Latest Railway Jobs


Latest Faculty Jobs


Defence / Police Jobs


Latest Walk in Interview's


Job Mela


Current Affairs


General Knowledge