March 12, 2019

RRB Level 1 Notification 2019 | Apply Online for RRC 1,03769 Posts

రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుండి దేశ వ్యాప్తంగా ఉన్న 16 రైల్వే జోన్ల పరిధిలో ఖాళీగా ఉన్న లెవెల్ 1 కేటగిరి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం రైల్వేలో 1,03769 లెవ‌ల్ 1 పోస్టులు భర్తీ చేయనున్నారు. అర్హులయిన అభ్యర్థులు ఈ పోస్టులకు 12 మార్చి 2019 నుండి 12 ఏప్రిల్ 2019 లోగా ఆర్ ఆర్ బి వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి. 

వివరాలు :  

మొత్తం పోస్టుల సంఖ్య :  దేశ వ్యాప్తంగా మొత్తం 16 రైల్వే జోన్లలో   1,03769 పోస్టులు ఉండగా సికిందరాబాద్ రైల్వే జోన్ పరిధిలో 9,328 ఖాళీలు ఉన్నాయి. 

ఇందులో 
1 ASSISTANT POINTS MAN 14870
2 ASSISTANT BRIDGE 913
3 TRACK MAINTAINER GRADE IV 40721 

అర్హ‌త‌: ప‌దోత‌ర‌గ‌తి లేదా ఐటీఐ/ నేష‌న‌ల్ అప్రెంటిస్‌షిప్ స‌ర్టిఫికెట్ ఉత్తీర్ణ‌త‌.

వయసు :  01 జులై 2019 నాటికీ 18 నుండి 33 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ల ప్రకారం ఆయా వర్గాల వారికీ వయసుపరిమితిలో సడలింపు ఉంటుంది. 

అప్లికేషన్ ఫీజు :  జనరల్ / బిసి కేటగిరీలకు చెందిన పురుష అభ్యర్థులు మాత్రమే 500 రూపాయల ఎక్జామినేషన్ ఫీజు ను ఆన్లైన్ ద్వారా కానీ, పోస్టల్ ఆర్డర్ ద్వారా కానీ, స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా చలానా రూపంలో కానీ చెల్లించవచ్చు, వీరు మొదటి దశ కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ ఎక్జామ్ కు అటెండ్ అయిన వారికి మాత్రమే 400 రూపాయలను బ్యాంక్ చార్జీలను మినహాయించి వారి బ్యాంక్ అకౌంట్ కు తిరిగి చెల్లిస్తారు, ఇక ఎస్సి/ ఎస్టీ / అన్నికేటగిరీలకు చెందిన మహిళా అభ్యర్థులు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వారు, దివ్యంగులకు ఫీజు 250 రూపాయలు చెల్లించాలి, వీరికి కూడా మొదటి దశ కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ ఎక్జామ్ కు అటెండ్ అయిన వారికి మాత్రమే 250 రూపాయలను బ్యాంక్ చార్జీలను మినహాయించి వారి బ్యాంక్ అకౌంట్ కు తిరిగి చెల్లిస్తారు,

ఎంపిక విధానం :  ఎంపిక విధానము కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ ఎక్జామ్ ద్వారా జరుగుతుంది. ఈ ఎక్జామ్ ను 100 మార్కులకు నిర్వహిస్తారు, ఇందులో General Science  నుండి 25 మార్కులకు , Mathematics నుండి 25 మార్కులకు ,  General Intelligence and reasoning నుండి 30 మార్కులకు, General Awareness and Current Affairs నుండి 20 మార్కులకు మొత్తం 100 ప్రశ్నలు, 100 మార్కులకు నిర్వహిస్తారు, పరీక్షా సమయం గంట ముప్పయి నిమిషాలు. ఈ పరీక్షను పూర్తిగా మల్టిపుల్ ఛాయిస్ విధానం లో ప్రశ్నలు ఇస్తారు.  ఈ పరీక్షను 2019 సెప్టెంబ‌ర్‌-అక్టోబ‌ర్ నెల‌ల్లో. నిర్వహించే అవ‌కాశం ఉంది

ముఖ్యమైన తేదీలు :  
ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు చివ‌రితేది: 12.04.2019.
ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లింపున‌కు చివ‌రితేది: 23.04.2019.
ద‌ర‌ఖాస్తుల‌ తుది స‌మ‌ర్ప‌ణ‌: 26.04.2019.
క‌ంప్యూట‌ర్ ఆధారిత ప‌రీక్ష: సెప్టెంబ‌ర్‌-అక్టోబ‌ర్ నెల‌ల్లో.

0 Comments

Govt. Jobs


Private Jobs


Telangana Job Updates


Bank Jobs Updates


Latest Railway Jobs


Latest Faculty Jobs


Andhra Pradesh Jobs Updates


Defence / Police Jobs


Latest Walk in Interview's


Job Mela


Admissions


Results


Current Affairs


General Knowledge