May 7, 2019

ఆంధ్రప్రదేశ్ లో రెండవ డిఎస్సి 2019 నోటిఫికేషన్ విడుదల - 602 స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగాలు

Note :  ఏపీలో ప్రత్యేక ఉపాధ్యాయ డీఎస్సీ పోస్టులకు వయోపరిమితిని ప్రభుత్వం పెంచింది. ఈ మేరకు గరిష్ఠ వయోపరిమితి 54 ఏళ్లకు పెంచుతూ పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్‌ మే 6న ఉత్తర్వులు జారీచేశారు.దీంతో అభ్యర్థులందరికీ వయోపరిమితి పెంచుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. వయోపరిమితి పెంపు నేపథ్యంలో దరఖాస్తు గడువును 16 మే 2019 వరకు పొడిగించారు. 

ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యశాఖ నుండి ప్రత్యేక విద్య పాఠశాల సహాయకుల (స్కూల్ అసిస్టెంట్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలచేశారు. ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు సమగ్ర శిక్షా అభియాన్ పథకం లో భాగంగా ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. 
వివరాలు :  

మొత్తం పోస్టుల సంఖ్య :  602 పోస్టులు 

పోస్టు పేరు :  స్కూల్ అసిస్టెంట్ (స్పెషల్ ఎడ్యుకేషన్)

జిల్లాల వారీగా ఖాళీలు :
1. శ్రీకాకుళం- 37 పోస్టులు 
2. విజయనగరం- 41 పోస్టులు 
3. విశాఖపట్నం- 34 పోస్టులు 
4. తూర్పు గోదావరి- 52 పోస్టులు 
5. పశ్చిమ గోదావరి- 43 పోస్టులు 
6. కృష్ణా- 46 పోస్టులు 
7. గుంటూరు- 50 పోస్టులు 
8. ప్రకాశం- 50 పోస్టులు 
9. నెల్లూరు- 43 పోస్టులు 
10. కడప- 46 పోస్టులు 
11. చిత్తూరు- 57 పోస్టులు 
12. అనంత‌పురం- 55 పోస్టులు 
13. కర్నూలు - 48 పోస్టులు 

అర్హత :  ఏదైనా డిగ్రీతో పాటు బీఈడీ(ప్ర‌త్యేక విద్య‌) లేదా డిగ్రీ, బీఈడీ(జ‌న‌ర‌ల్‌)తో పాటు ప్ర‌త్యేక విద్య‌లో డిప్లొమా/ పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రొఫెష‌న‌ల్ డిప్లొమా ఉత్తీర్ణ‌త‌.

వయసు : 1 జులై 2018 నాటికీ జనరల్ కేటగిరి వారికీ 42 ఏళ్ల లోపు ఉండాలి. ఎస్సి / ఎస్టీ / బిసి వారికి 05 ఏళ్ళు వయసు పరిమితి సడలింపు ఉంటుంది. 

ఎంపిక విధానం :   కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ ఎక్జామ్ ద్వారా దీనిని 15 మే 2019 న నిర్వహిస్తారు. ఈ పరీక్షను ఆంధ్రప్రదేశ్ లోని 13 జిల్లాలలో నిర్వహిస్తారు. 

ముఖ్యమైన తేదీ:  
ఆన్లైన్ లో దరకాస్తులు ప్రారంభం :   25.02.2019 నుంచి 11.03.2019 (16-05-2019)వ‌ర‌కు.
ఆన్‌లైన్‌ దరఖాస్తు చివరితేది: 16.05.2019 (Date Extended).

0 Comments

Govt. Jobs


Private Jobs


Telangana Job Updates


Bank Jobs Updates


Latest Railway Jobs


Latest Faculty Jobs


Andhra Pradesh Jobs Updates


Defence / Police Jobs


Latest Walk in Interview's


Job Mela


Admissions


Results


Current Affairs


General Knowledge