September 11, 2018

RRB Mock Test 2018 : RRB Group D Computer Based Test

రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డు (ఆర్ ఆర్ బీ) త్వరలో నిర్వహించనున్న గ్రూప్ - డి నియామకాల కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సీబీటీ) మాక్ టెస్ట్ లను  వెబ్ సైట్లో అందుబాటులోకి తీసుకొచ్చారు. 

రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డు (ఆర్ ఆర్ బీ) సికింద్రాబాద్, ఇతర రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డు (ఆర్ ఆర్ బీ) రీజియన్ వెబ్ సైట్లలో మాక్ టెస్ట్ రాయవచ్చు. కంప్యూటర్ బేస్ పరీక్షలతో అంతగా పరిచయం లేని ఆభ్యర్థులు ఈ మాక్ టెస్ట్లు రాయడం ద్వారా పరీక్ష విధానం పై అవగాహన పెంపొందించుకోవచ్చు. 
మాక్ టెస్ట్ రాయడానికి ఎలాంటి యూజర్ నేమ్, పాస్వర్డ్లు అవసరం లేదు. నేరుగా వెబ్ సైట్లో లింక్ ఓపెన్ చేసి రాయవచ్చు. గ్రూప్ - డి అడ్మిట్ కార్డులు / హాల్ టిక్కెట్లు ఈనెల 18వ తేదీ నుంచి ఆర్ ఆర్ వెబ్ సైట్ల ద్వారా అందుబాటులోకి రానున్నాయి. 

అభ్యర్థులు వీటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు. గ్రూప్ - డి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్స్ సెప్టెంబరు 17 నుంచి అక్టోబరు 16 వరకు జరగనున్నాయి. ఈ పరీక్షల ద్వారా దాదాపు 63 వేల ఖాళీలను రైల్వే రిక్రూటిమెంట్ బోర్డ్ భర్తీ చేయనుంది. దేశవ్యాప్తంగా కోటి మందికి పైగా అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం పోటీపడుతున్నారు. 

సీబీటీలో మొత్తం 100 ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష వ్యవధి 90 నిమిషాలు. ప్రశ్నలు ఆబ్జెక్టివ్ మల్టిపుల్ చాయిస్ పద్దతిలో ఉంటాయి. మేథమేటిక్స్, జనరల్ ఇంటెలిజన్స్ అండ్ రీజనింగ్, జనరల్ సైన్స్, జనరల్అవేర్ నెస్ , కరెంట్ అఫైర్స్ అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు.  

0 Comments

Advertisements

Andhra Pradesh Jobs Updates


Telangana Job Updates


Govt. Jobs


Private Jobs


Bank Jobs Updates


Latest Railway Jobs


Latest Faculty Jobs


Defence / Police Jobs


Latest Walk in Interview's


Job Mela


Current Affairs


General Knowledge