September 16, 2018

జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో కాంట్రాక్ట్ ఉద్యోగాలు

రాజమహేంద్రవరం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలోని ఎన్టీఆర్ సెంటర్లో పని చేయడానికి కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు మెడికల్ సూపరింటెండెంట్, జిల్లా ఆస్పత్రుల సమన్వయకర్త డాక్టర్ టి.రమేష్ కిషోర్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. 
ఎన్టీఆర్ సెంటర్లో మెడికల్ ఆఫీసర్-1, ఫార్మసిస్ట్-1, ల్యాబ్ టెక్నీషియన్-1 పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. మెడికల్ ఆఫీసర్ కు ఎంబీబీఎస్ ఆర్హత, జీతం రూ.36 వేలు, ఫార్మసిస్ట్ ఉద్యోగాలకు  బీ ఫార్మసీ, లేదా డి ఫార్మసీ ఉత్తీర్ణులైన వారు అర్హులని, జీతం రూ.18 వేలు ఇస్తారని తెలిపారు. 

ల్యాబ్ టెక్నీషియన్లకు మెడికల్ ల్యాబోరేటరీలో గ్రాడ్యుయేట్ లేదా డిప్లమో ఇన్ ఎంఎల్టీ తప్పని సరిగా స్టేట్ కౌన్సిల్లో నమోదై ఉండాలని తెలిపారు. జీతం రూ.13 వేలు అన్నారు. 

ఆసక్తి గల వారు దారకాస్తులను ది మెడికల్ సూపరింటెండెంట్, ఎన్టీఆర్ సెంటర్, జిల్లా ఆసుపత్రి రాజమహేంద్రవరం అనే చిరునామాకు 23 వ  తేదీ సెప్టెంబర్ 2018 లోగా అందజేయాలన్నారు.

0 Comments

Advertisements

Andhra Pradesh Jobs Updates


Telangana Job Updates


Govt. Jobs


Private Jobs


Bank Jobs Updates


Latest Railway Jobs


Latest Faculty Jobs


Defence / Police Jobs


Latest Walk in Interview's


Job Mela


Current Affairs


General Knowledge