September 15, 2018

గుంటూరు జిల్లాలో మెగా అప్రెంటిస్ షిప్ మేళా

 ఇంటర్మీడియెట్ విద్యాశాఖ ఆధ్వర్యంలో 2018 సెప్టెంబర్ 18న  గుంటూరు సాంబశివపేటలోని ప్రభుత్వ వృత్తి విద్యా జూనియర్ కళాశాలలో అప్రెంటిస్ షిప్ మేళా నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ కె. ఆనందబాబు తెలిపారు. ఉద్యోగ, ఉపాధి కల్పనలో భాగంగా నిర్వహిస్తున్న అప్రెంటిస్ షిప్ మేళాకు కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల పరిధిలో 2016,17,18 సంవత్సరాల్లో వృత్తి విద్యా కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులు హాజరు కావాలని కోరారు. 
వివిధ పారిశ్రామిక, వ్యాపార సంస్థలతో పాటు ఆస్పత్రుల ప్రతినిధులు పాల్గొని విద్యార్థులను నెలకు రూ 2750స్టైఫండ్ తో పాటు నైపుణ్య శిక్షణకు ఎంపిక చేస్తారని తెలిపారు. స్టేట్ ఇనిస్టిట్యూట్ ఒకేషనల్ ఎడ్యుకేషన్ ప్రొఫెసర్ పి. యర్రయ్య సారధ్యంలో జరిగే అప్రెంటిస్ షిప్ మేళాకు డీవీఈవో బి. మాల్యాద్రి సమన్వయకర్తగా వ్యవహరిస్తారని పేర్కొన్నారు.

0 Comments

Advertisements

Andhra Pradesh Jobs Updates


Telangana Job Updates


Govt. Jobs


Private Jobs


Bank Jobs Updates


Latest Railway Jobs


Latest Faculty Jobs


Defence / Police Jobs


Latest Walk in Interview's


Job Mela


Current Affairs


General Knowledge