September 12, 2018

అంగన్వాడీ ఉద్యోగాలు - సీతంపేట లో అంగన్వాడీ ఉద్యోగాలు

సీతంపేట ఐటీడీఏ పరిధి గిరిజన  గ్రామాల్లో ఖాళీగా ఉన్న  ఆయా, మినీ అంగనవాడీ కార్యకర్తల పోస్టుల భర్తీ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు  సీడీపీవో విమలారాణి తెలిపారు.
కొత్తూరు ప్రాజెక్టు పరిధి కొత్తూరు మండలం కాకరగూడ అంగనవాడీ కేంద్రంలో ఆయా పోస్టుకు ఎస్టీ అభ్యర్థులు, సంగన్న గూడ, ఎగువ మల్లెలగూడ, అడ్డంగి మినీ అంగన్వాడీల్లో కార్యకర్తల పోస్టులకు ఓసీ అభ్యర్థులు, పెద్దమడి, జన్నడు గూడ, నాయుడుగూడ, ఎగువ దొండమామిడి గూడ కార్యకర్తలు ఎస్టీ అభ్యర్థులు అర్హులుగా పేర్కొన్నారు. భామిని మండలంలో రాతులుగూడ, మూల గూడ, చింతలగూడ, గిద్దలగూడ, సన్నాయి కాలనీ, రేగిడి మినీ అంగనవాడీ కార్యకర్తల పోస్టులకు ఎస్టీ అభ్యర్థులు అర్హులని తెలిపారు. 

హిరమండలం మండలం లోదాసుమామిడి గూడ మినీ కేంద్రం కార్యకర్త పోస్టు ఓసీ అభ్యర్థికి, అంతిలి, గుర్రాలమేట్ట, కోపిరగూడ, పుట్టిగాం, దిగువ కురిడి మినీ కేంద్రాల కార్యకర్తల పోస్టులు ఎస్టీ అభ్య ర్థులకు కేటాయించారు. 

18 తేదీ సెప్టెంబర్ 2018 సాయంత్రం 5 గంటలోపు ప్రాజెక్టు కార్యాలయానికి దరఖాస్తులు అందజేయాలని పేర్కొన్నారు. వివరాలకు 09490067912 ఫోన్ చేయాలని సూచించారు. 

1 Comments

Unknown said...

Railway Recruitment Board has released the RRB Guwahati Hall Ticket 2018 on their site. Railway Recruitment Board has also released the Group D exam test state and city, test language, date of exam, reporting time, etc. Kindly check for the mock test link on the official website of rrb to prepare well.
Also check for the Railway Hall Ticket on the official website of RRB.

Advertisements

Andhra Pradesh Jobs Updates


Telangana Job Updates


Govt. Jobs


Private Jobs


Bank Jobs Updates


Latest Railway Jobs


Latest Faculty Jobs


Defence / Police Jobs


Latest Walk in Interview's


Job Mela


Current Affairs


General Knowledge