Latest Jobs
Loading...

September 7, 2018

ఆంధ్రప్రదేశ్ సర్వ శిక్షా అభియాన్ లో అవుట్ సోర్సింగ్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్

సర్వశిక్షా అభియాన్ లో పొరుగు సేవల ద్వారా నియామకం కానున్న పోస్టుల భర్తీకి అడ్డంకులు తొలగి పోయాయి. ఈ మేరకు (05/09/2018) బుధవారం విశాఖలో పాఠశాల విద్యాశాఖ స్పెషల్ చీఫ్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉత్తర్వులు జారీచేశారు. 

గతంలో ఈ పోస్టుల భర్తీకి నిరుద్యోగుల నుంచి తీవ్రపోటీ ఉండడంతో కొందరు దళారులు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారన్న ఆరోపణల నేపథ్యంలో నియామక ప్రక్రియ. నిలిపివేసిన విషయం విదితమే.

ఆ సమయంలో రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాల్లో 12 మ్యాన్ పవర్ సప్లై ఏజెన్సీల ద్వారా సర్వశిక్షా అభియాన్ లో జరుపుతున్న పోస్టుల భర్తీ నిలుపుదల చేయాలని సర్వశిక్షా అభియాన్ రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ ఆదేశాలు జారీచేశారు. దీంతో ఈ ఏడాది  జూన్ 27 నుంచి నియామక ప్రక్రియ నిలిచిపోయింది.  ఈ ఆరోపణల నేపథ్యంలో ఈ మొత్తం అంశాలపై విచారణ చేయాల్సిందిగా విశాఖకు చెందిన సీబీఐ, ఏసీబీ అధికారులను ప్రభుత్వం కోరింది. 
వారిచ్చిన నివేదిక ఆధారంగా రాష్ట్ర వ్యాప్తంగా సర్వశిక్షా అభియాన్, కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో పొరుగు సేవల ద్వారా పోస్టుల భర్తీ చేపట్టాలని, నెల రోజుల కాల వ్యవధిలో ఈ ప్రక్రియ జరపాలని తాజాగా పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ బుధవారం(05/09/2018) న  ఉత్తర్వులు విడుదల చేశారు. ఈ ఉత్తర్వుల ప్రకారం సీఆర్టి , ఎస్ఓ తదితర అధ్యాపక పోస్టులకు ఆయా జిల్లాల కలెక్టర్ల పర్యవేక్షణలో రాత పరీక్ష నిర్వహించిన అనంతరం పోస్టులు భర్తీ చేస్తారు. 

జిల్లాల వారీగా శ్రీకాకుళం-207, విజయనగరం-147, విశాఖపట్నం-242, తూర్పుగోదావరి-235, పశ్చిమగోదావరి-97, కృష్ణా జిల్లా-141, గుంటూరు-221, ప్రకాశం-76, నెల్లూరు-132, చిత్తూరు-483, కడప-105, అనంతపురం-117, కర్నూలు-176 మొత్తం 2379 పోస్టులు భర్తీ కానున్నాయి.

మిగిలిన నాన్ టీచింగ్ పోస్టులను జిల్లాల వారీగా ఆయా ఎస్ఎస్ఏ ప్రాజెక్టు డైరెక్టర్ల ఆదేశాలకు అనుగుణంగా ఏజెన్సీల ద్వారా భర్తీ చేస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా క్షేత్ర స్థాయి ఇంజినీర్లు, ప్రత్యేక అధికారులు, పాఠశాలల సముదాయాల పరిధిలోని సీఆర్పీలు, వ్యాయామ ఉపాధ్యాయులు, ఏఎన్ఎంలు, వంట మనుషులు ఇలా 24 విభాగాల్లో 2379 పోస్టులు భర్తీ కానున్నాయి. 

0 comments

Bank Jobs Updates


Andhra Pradesh Jobs Updates


Telangana Job Updates


Latest Railway Jobs


Latest Police Jobs


Latest Teacher Jobs