Latest Jobs
Loading...

September 12, 2018

శ్రీకాకుళం ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాలలో ఉద్యోగ మేళా

హైదరాబాద్ లోని డాక్టర్ రెడ్డీస్ ఫార్మా కంపెనీలో ఉద్యోగాలకు శ్రీకాకుళం లోని ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాలలో ఈ నెల 15న ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు డీఆర్ డీఏ పీడీ జీసీ కిషోర్ కుమార్  తెలిపారు. 

2018 ఇంటర్మీడియట్ లో ఎంపీసీ, బైపీసీ గ్రూపుల్లో కనీసం 60 శాతం మార్కులు పొందిన రెగ్యులర్ స్త్రీ, పురుష అభ్యర్డు లు అర్హులని పేర్కొన్నారు. 
1998 అక్టోబర్ ఒకటి నుంచి 2000 సెప్టెంబర్ 25వ తేదీల మధ్య జన్మించిన వారై 18 నుంచి 20 ఏళ్ల మధ్య వయసు ఉండాలని సూచించారు. 

ఎంపికైనవారు హైదారాబాద్ లోని బాచుపల్లిలో డాక్టర్ రెడ్డీస్ ఫార్మాలో ఉద్యోగం చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. రేషన్, ఆధార్ కార్డులు,  విద్యార్హత ధ్రువపత్రాలు, రెండు పాస్ పోర్టు ఫొటోలు, బయోడేటా తో ఇంటర్వ్యూలకు హాజరుకావాలని తెలిపారు.

0 comments

Bank Jobs Updates


Andhra Pradesh Jobs Updates


Telangana Job Updates


Latest Railway Jobs


Latest Police Jobs


Latest Teacher Jobs