September 19, 2018

ఆంధ్ర ప్రదేశ్ లో 18450 పోస్టుల భర్తీకి గవర్నమెంట్ ఆర్డర్ జారీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వివిధ శాఖల్లో 20వేలకు పైగా పోస్టుల భర్తీకి సెప్టెంబర్ 18న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆమోదం తెలిపినట్లు వార్తలు వస్తున్నా అందులో ఏమాత్రం నిజం లేదు. ఎందుకంటే 19 సెప్టెంబర్ 2018 న ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఈ ఖాళీలకు సంబంధించి ఒక జి ఓ ను పాస్ చేసింది . దాని ప్రకారం మొత్తంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో వివిధ విభాగాలలో 18450 పోస్టులు మాత్రమే ఉన్నట్లు ఆ గవర్నమెంట్ ఆర్డర్ లో క్లియర్ గా పేర్కొన్నారు. ఆ జి ఓ వివరాలు ఇప్పుడు చూద్దాం.

వివరాలు 
గ్రూప్ 1 -  182
గ్రూప్ 2 - 337
గ్రూప్ 3 - 1670
హోమ్ డిపార్ట్మెంట్  3000
మెడికల్ & హెల్త్  - 1604
లెక్చరర్ - 725
DSC (టీచర్) - 9275
ఇతర ఉద్యోగాలు - 1657
మొత్తం 18450 పోస్టులు 

గ్రూప్ 1 ద్వారా మొత్తం 182 ఖాళీలు 
రెవిన్యూ డిపార్ట్మెంట్ లోడిప్యూటీ కలెక్టర్లు 30 కమర్షియల్ టాక్స్  ఆఫీసర్ 5, అసిస్టెంట్  ప్రొబేషనరీ  & ఎక్సిజ్ సూపెరిండెంటెంట్ 10,  హోమ్ డిపార్ట్మెంట్ లో డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ 1,  డిప్యూటీ  సూపెరింటెండ్ అఫ్ జైల్స్ 1,  DSP (సివిల్ ) 24 , ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో ATO/AAO 13 పోస్టులు, ట్రాన్స్ పోర్ట్ డిపార్ట్మెంట్ లో ఆర్టీఓ 5 , ఎంపిడిఓ 93 పోస్టులు మొత్తం 182 ఖాళీలు ఉన్నట్లు గవర్నమెంట్ ఆర్డర్ లో పేర్కొన్నారు.


గ్రూప్ 2 లో మొత్తం 337 పోస్టులు
సెక్రటేరియట్ లో అసిస్టెంట్  సెక్షన్  ఆఫీసర్ 12, అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ లో  అసిస్టెంట్  సెక్షన్  ఆఫీసర్ 150, కో ఆపరేటివ్ సొసైటీ లలో అసిస్టెంట్ రిజిస్ట్రార్ 23, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ 15, లా డిపార్ట్మెంట్ లో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ 2, కమర్షియల్ PR&RD లో ఎక్స్ టెన్షన్ ఆఫీసర్ 40, రెవిన్యూ డిపార్ట్మెంట్ లో డిప్యూటీ తహసీల్దార్ 16, దేవదాయశాఖలో గ్రేడ్ 1 ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ 6, గ్రేడ్ 3 మున్సిపల్ కమిషనర్  3 , ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో సీనియర్ అకౌంట్స్ 20, రెవిన్యూ డిపార్ట్మెంట్ లో ఎక్సయిజ్ సబ్ ఇన్స్పెక్టర్ 50 పోస్టులతో కలిపి మొత్తం 337 పోస్టులు ఉన్నాయి. 

గ్రూప్ 3 ద్వారా మొత్తం 1670 పోస్టులను భర్తీ చేస్తామని గవర్నమెంట్ ఆర్డర్ లో పేర్కొన్నారు. వీటిలో పంచాయతీ సెక్రటరీ 1000 పోస్టులు, రెవిన్యూ డిపార్ట్మెంట్ లో జూనియర్ అసిస్టెంట్ కం కంప్యూటర్ అసిస్టెంట్ 670 ఉన్నాయి 

హోమ్ డిపార్ట్మెంట్ లో సివిల్ పోలీస్ కానిస్టేబుల్ 1600, ఏఆర్ కానిస్టేబుల్ 300, ఏపీఎస్పీ పోలీస్ కానిస్టేబుల్ 300, సివిల్ సబ్ ఇన్స్పెక్టర్ 150, ఏఆర్ ఆర్ ఎస్ ఐ 75, ఏపీఎస్పీ ఆర్ ఎస్ ఐ 75, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ 50, స్టేషన్ ఫైర్ ఆఫీసర్ 20, డ్రైవర్ ఆపరేటర్ 30, ఫైర్ మాన్ 400 మొత్తం 3000 ఉద్యోగాలు 

మెడికల్ & హెల్త్ డిపార్ట్మెంట్ లో అసిస్టెంట్ ప్రొఫెసర్ 243, సివిల్ అసిస్టెంట్ సర్జన్ 1171, స్పెషల్ సివిల్ అసిస్టెంట్ సర్జన్ 155, డెంటల్ అసిస్టెంట్ సర్జన్ 35 పోస్టులతో కలిపి 1604 పోస్టులు 

ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో పాలిటెక్నిక్ లెక్చరర్ 310, జూనియర్ లెక్చరర్ 200, సోషల్ వెల్ఫేర్ జూనియర్ కాలేజీ లెక్చరర్ 10, డిగ్రీ కాలేజీ లెక్చరర్ 5, హయ్యర్ ఎడ్యుకేషన్ డిగ్రీ కాలేజ్ లెక్చరర్ 200 మొత్తం 725 పోస్టులు  , మొత్తం గ్రూప్ 3 ద్వారా 1670 పోస్టులను భర్తీ చేయనున్నారు. 

వివిధ డిపార్ట్మెంట్ లలో ఇంగ్లీష్ రిపోర్టర్ 3, లెజిస్లేటివ్ ఆఫీసర్ 3, రీసెర్చ్ ఆఫీసర్ 2, తెలుగు రిపోర్టర్ 5, అసిస్టెంట్ తెలుగు ట్రాన్స లేటర్ 2, వార్దర్ (పురుషులు) 100, వార్దర్ (మహిళలు) 23, డిప్యూటీ జైలర్ (పురుషులు) 10, డిప్యూటీ జైలర్ (మహిళలు) 4, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ 25, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ 20, ఇన్స్పెక్టర్ అఫ్ బాయిలర్లు 2, FRO -20, FSO - 50, FBO 330, ABO 100, అసిస్టెంట్ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ 2, అగ్రికల్చర్ ఆఫీసర్ 25,హార్టీ కల్చర్ ఆఫీసర్ 17, సేరి కల్చర్ ఆఫీసర్ 13, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ 26, డివిజినల్ ఆకాంట్స్ ఆఫీసర్ (మహిళలు)  20, A.E.Es.66, A.E.Es. 50, A.Es. 50, సెక్షన్ ఆఫీసర్ 126, గ్రేడ్ 1 ఎక్సటెన్షన్ ఆఫీసర్ 100, అసిస్టెంట్ కమిషనర్ 7, అసిస్టెంట్ ఇంజినీర్ 3, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ 3 గ్రేడ్ 60, అసిస్టెంట్ డైరెక్టర్ అఫ్ ఫిషరీస్ 12, D.P.R.Os.- 4, D.E.I.Es. 5, A.P.R.Os. -12, ఎక్సయిజ్ కానిస్టేబుల్ 100, గ్రేడ్ 2 లైబ్రేరియన్ 5, గ్రేడ్ 3 లైబ్రేరియన్ 25 పోస్టులు ఉన్నాయి. 

డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ (డి ఎస్సి)ద్వారా మొత్తం 9275 పోస్టులు భర్తీ  చేయనున్నారు. వీటిలో జిల్లా పరిషద్, మండల ప్రజా పరిషద్ పాఠశాలల్లో మొత్తం 5000 పోస్టులు ఉండగా మున్సిపల్ వెకన్సీస్ 1100, గురుకుల టీచర్ 1100, సోషల్ వెల్ఫేర్ పాఠశాలల్లో 750, ఆశ్రమ పాఠశాలల్లో 800, బిసి వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ లలో 350, AP REI Society (Teachers 175పోస్టులు ఉన్నాయి,

 ఏపీపీఎస్సీ వివిధ ప్రభుత్వ విభాగాల్లో ఖాళీ పోస్టుల భర్తీకి వీలుగా ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీచేయగానే తమ ప్రక్రియను ప్రారంభిస్తామని ఏపీపీఎస్సీ చైర్మన్‌ పిన్నమనేని ఉదయభాస్కర్‌ తెలిపారు. అక్టోబరు నెలాఖరులో ఏపీపీఎస్సీ నుంచి తొలి నోటిఫికేషన్‌ విడుదల చేస్తామని ఆయన చెప్పారు. డిసెంబరులోగా అన్ని రకాల నోటిఫికేషన్లు జారీ చేస్తామన్నారు.

0 Comments

Govt. Jobs


Private Jobs


Telangana Job Updates


Bank Jobs Updates


Latest Railway Jobs


Latest Faculty Jobs


Andhra Pradesh Jobs Updates


Defence / Police Jobs


Latest Walk in Interview's


Job Mela


Admissions


Results


Current Affairs


General Knowledge