Latest Jobs
Loading...

August 2, 2018

Mukhyamantri Yuva Nestam (Nirudyogabruthi) : AP Nirudyogabruthi Apply Online now....

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చిన ఎన్నికల హామీలలో నిరుద్యోగభృతి  కూడా ఒకటి , ఈ పథకానికి ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది .

ఆంధ్ర ప్రదేశ్ లో ఉన్న దాదాపు 13 లక్షల మంది నిరుద్యోగులకు నెలకు వెయ్యి రూపాయల చొప్పున నిరుద్యోగభృతి ఇవ్వనున్నారు. ఈ పథకానికి " ముఖ్యమంత్రి యువ నేస్తం" అనే పేరును ఖరారు చేశారు. 2016 లో జరిగిన పల్స్ సర్వ్ ఆధారంగా నిరుద్యోగులకు ప్రతి నెల వెయ్యి రూపాయల చొప్పున ఆన్లైన్ లో వారి బ్యాంక్ ఖాతాలలో జమ చేయనున్నారు. దీనికోసం ప్రభుత్వం సంవత్సరానికి దాదాపు 1470 కోట్లు ఖర్చు చేయనున్నట్లు సమాచారం.

ఏదయినా డిగ్రీ, పాలిటెక్నిక్, పూర్తీ చేసినవారిని ఈ పథకానికి అర్హులుగా నిర్ణయించారు. అలాగే వీరికి వయసు 22 ఏళ్ళ నుండి 35 ఏళ్ళ మధ్య ఉన్నవారు మాత్రమే అర్హులు. అలాగే ఒక ఇంట్లో ఒకరికి మాత్రమే ఇవ్వాలని ఇంతకు ముందు నిర్ణయించినా ఈ కేబినెట్ సమావేశంలో ఇంట్లో ఎంతమంది నిరుద్యోగులు ఉన్నా వారందరికీ నిరుద్యోగ భృతి ఇవ్వాలని నిర్ణయించారు.

అలాగే ఈ కేబినెట్ సమావేశంలో దాదాపు 20 వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి కూడా ఆమోదం తెలిపారు. ఇందులో 9వేల  టీచర్ పోస్టులతో పాటు వివిధ శాఖలలో ఉన్న ఖాళీలతో త్వరలోనే నోటిఫికేషన్లు విడుదల కానున్నాయి. ఈ ముఖ్యమంత్రి యువ నేస్తం పథకానికి ఆన్లైన్ లో ఆగస్టు రెండవ వారం నుండి దారకాస్తులు స్వీకరించనున్నారు. 

2 comments

Unknown said...

only for applying degree, pg, students what about degree failure students & intermediate drop out students pls applicable to 20-35 years all boys & girls.


please receive this messagge for TDP IN CABINET.

THANKS

Unknown said...

only for applying degree, pg, students what about degree failure students & intermediate drop out students pls applicable to 20-35 years all boys & girls.


please receive this messagge for TDP IN CABINET.

THANKS