August 12, 2018

How to Andhra Pradesh Nirudyogabruthi Online? How to Register AP Yuva Nestam Online

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపి యువ నాంది పథకం / నిరుద్యోగ భృతి పథకం 2018 ను ప్రవేశపెట్టింది. ఈ నిరుద్యోగ భృతి పొందటానికి ఆంధ్ర ప్రదేశ్లోని నిరుద్యోగ యువతి యువకులు 12 ఆగస్టు 2018 నుండి ఆన్లైన్ లో దరకాస్తు చేసుకోవలసి ఉంటుంది. దీని చివరి తేదీ అంటూ ఏమిలేదు. ఎప్పుడయినా దరకాస్తు చేసుకోవచ్చు. ముఖ్యమంత్రి యువ నేస్తం నిరుద్యోగ భృతికి ఆన్లైన్ లో అప్లై చేసుకోవడానికి లింక్ ఇచ్చాము. అర్హతలు గలవారు ఆ లింక్ క్లిక్ చేసి ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు . అయితే అప్లై చేసుకోవడానికి ముందు మీకు ప్రభుత్వం నిర్ణయించిన అర్హతలు ఉన్నాయో లేవో ఒకసారి చెక్ చేసుకోండి. అర్హతలు ఏమిటంటే

దరఖాస్తుదారులు నిరుద్యోగులై ఉండాలి మరియు ఆంధ్రప్రదేశ్ కు చెందిన వారు అయి ఉండాలి. దీనిని ఎలా నిర్ణయిస్తారు అంటే 2016 లో ఆంధ్రప్రదేశ్ లో జరిగిన పల్స్ సర్వ్ ఆధారంగా నిర్ణయిస్తారు. ఒకవేళ పల్స్ సర్వేలో ఏవయినా తప్పులు ఉంటె మీరు మీ జిల్లా కార్పొరేషన్ ఆఫీస్ కు వెళ్లి సంబంధిత పత్రాలు ఇచ్చి వాటిని సరి చేసుకోవచ్చు

రిజిస్టర్ చేసుకొనే వారు తప్పని సరిగా  ఓటరు ఐడి / రేషన్ కార్డును అప్లోడ్ చేయాలి.

కనీస విద్యార్హత గ్రాడ్యుయేషన్ అయి ఉండాలి.  కనీస విద్యార్హత లేని వారు పొందలేరు.

వయసు 22-35 సంవత్సరాల వయస్సు ఉండాలి.  నిబంధనల ప్రకారం కుల మరియు కమ్యూనిటీ ప్రాధాన్యత ఇవ్వబడుతుంది
దారిద్య్రరేఖకు దిగువ ఉన్న కుటుంబానికి చెంది ఉండాలి. ఒకే కుటుంబానికి చెందిన అన్ని అర్హతలు గల లబ్ధిదారులు పరిగణనలోకి తీసుకోబడతారు.

వాహనాలు కలిగిన వారు అనర్హులు. 2.5 ఎకరాల బంజరు భూములు , గరిష్టంగా 5.00 ఎకరాల బీడు భూమిని కలిగిన వారు అర్హులు.

ఆర్ధిక సహాయం అందించిన వారు/  రాష్ట్రం / కేంద్ర ప్రభుత్వం కింద స్వయం ఉపాధి పథకం కింద రుణం తీసుకొని ఉన్నా  అలాగే పబ్లిక్ / ప్రైవేట్ సెక్టార్ / ప్రభుత్వ అనుబంధ సస్థలద్వారా ఋణం తీసుకొని ఉపాధి పొందుతున్న  లేదా స్వయం ఉపాధి కలిగిన వారికి అర్హత లేదు. దరఖాస్తుదారు ఏదైన ప్రభుత్వ సేవ నుండి తొలగించిబడిన ఉద్యోగి అయి ఉండకూడదు. అభ్యర్థి ఏ క్రిమినల్ కేసు లోను దోషి అయి ఉండకూడదు

మీకు కనుక ఈ అర్హతలు ఉంటె ఆన్లైన్ లో రిజిస్టర్ చేసుకోవచ్చు. ఆన్లైన్ లో ఎలా రిజిస్టర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం . ఈ  లింక్ క్లిక్ చేస్తే ముఖ్యమంత్రి యువ నేస్తం పోర్టల్ లోకి వస్తారు. ఈ పోర్టల్ ఓపెన్ చేసిన తరువాత రిజిస్టర్ అనే లింక్ ను క్లిక్ చేయాలి ఇక్కడ ఆధార్ విత్ ఓటీపీ లేదా ఆధార్ విత్ బయోమెట్రిక్ అని రెండు అషన్స్ వస్తాయి .
డౌన్లోడ్ మొబైల్ అప్లికేషన్  అక్కడ ఆధార్ విత్ ఓటీపీ అని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ముఖ్యంగా గమనించవలసిన విషయం ఏమిటంటే మీ ఆధార్ నంబర్ కచ్చితంగా మీ మొబైల్ నుంబర్ కు లింక్ అయిఉండాలి. ఒకవేళ లింక్ కాకపోతే వెంటనే మీ సమీపంలోని ఆధార్ సెంటర్ కు వెళ్లి అప్డేట్ చేసుకొని తరువాత అప్లై చేసుకోండి.

 ఒకే ఇక్కడ ఆధార్ కార్డు నంబర్ ఎంటర్ చేసిన తరువాత రిజిస్టర్ నౌ అనే బటన్ క్లిక్ చేసిన తరువాత నెక్స్ట్ పేజీ లో మీ ఇమెయిల్ ఐడి మరియు మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి ఫస్ట్ మొబైల్ నెంబర్ కు ఒక ఓటీపీ వస్తుంది అది వెరిఫై ఐన తరువాత మీ ఇమెయిల్ వెరిఫై అయినా తరువాత మీ అడ్రస్ వివరాలు డిఫాల్ట్ గా మీ ఆధార్ కార్డులోని అడ్రస్ వస్తుంది. ఒకవేళ మీ అడ్రస్ మారినట్లయితే మనువల్ గా కూడా ఎంటర్ చేసుకోవచ్చు.

అలా ఎంటర్ చేసిన తరువాత నెక్స్ట్ బటన్ పైన క్లిక్ చేస్తే మీకు బ్యాంకు డీటెయిల్స్ వస్తాయి . మీరు కరెక్టుగా మీ బ్యాంకు నంబర్ , ఐఎఫ్సి కోడ్ ఎంటర్ చేయాలి. సో ఇలా రిజిస్టర్ చేసుకోవాలి. ఇలా రిజిస్టర్ చేసుకున్న తరువాత మీరు మల్లి హోమ్ పేజిలోకి వచ్చి లాగిన్ అనే బటన్ మీద క్లిక్ చేసి మీ ఆధార్ నంబర్ ఎంటర్ చేయగానే మీ మొబైల్ కు ఒక ఓటీపీ వస్తుంది సో ఇలా ఆంధ్ర ప్రదేశ్ నిరుద్యోగ భృతికి అప్లై చేసుకోవాలి.
ఇప్పుడే అప్లై చేసుకోండి
డౌన్లోడ్ మొబైల్ అప్లికేషన్ 

1 Comments

Anand said...

I have a query on AP Mukhyamantri Yuvanestham. What is the last date of applying for this scheme. The Site was not working. Iam trying lot of times. But website is not opening

Read more at: https://www.jntufastupdates.com/jntuh-implementation-of-biometric-attendance-system/

Advertisements

Local Small Business !deas


Private Jobs


Andhra Pradesh Jobs Updates


Telangana Job Updates


Govt. Jobs


Bank Jobs Updates


Latest Railway Jobs


Latest Faculty Jobs


Defence / Police Jobs


Latest Walk in Interview's


Job Mela